TSPSC Group-1 :ప్రిలిమ్స్‌లో ‘ఎకానమీ’ సబ్జెక్ట్ నుంచి అడిగే ప్రశ్నలు ఇవే..!
ఈ నేపథ్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ఎకానమీ’ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకుందామా...!
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
ఎకానమీలో ఇవి చదివితే..
ఇటీవల కాలంలో ఎంతో కీలకంగా మారుతున్న విభాగంగా ఎకానమీని పేర్కొనొచ్చు. ఈ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ–లక్షణాలు, జాతీయాదాయం, పంచవర్ష ప్రణాళికలు, పేదరికం–నిరుద్యోగం, వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు, పారిశ్రామికాభివద్ధి, సేవారంగ వద్ధి అంశాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా తాజా ఆర్థిక విధానాలు–పారిశ్రామిక తీర్మానాలు, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ద్రవ్యోల్బణం, వ్యవసాయ రంగం, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్‌ల గురించి సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. అదే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. సంబంధిత రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి– ఉత్పాదకత, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న తాజా ఆర్థిక విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా పారిశ్రామికాభివద్ధి, గ్రామీణ పరపతి,సేవారంగ ప్రాధాన్యం, ప్రాంతీయ అసమానతలు అంశాలపై శ్రద్ధ వహించాలి.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |
Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్