TSPSC Group-1 :ప్రిలిమ్స్‌లో ‘జాగ్రఫీ ’ సబ్జెక్ట్ నుంచి అడిగే ప్రశ్నలు ఇవే..!
జాగ్రఫీ ని ఇలా చదివితే.. మార్కులు మీవే..
ఈ విభాగం నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు అంచనా వేయొచ్చు. ఇండియన్ జాగ్రఫీతోపాటు రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలో, దేశంలో భౌగోళిక ప్రాశస్త్యం ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విభాగంలో సమకాలీన అంశాల కలయికగా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంది. సౌరకుటుంబం, వ్యవసాయం, పంటలు, వ్యవసాయ సమస్యలు, ప్రాంతీయ స్థాయిలో అమలవుతున్న కొత్త పథకాలు లేదా కొత్త ప్రాజెక్ట్‌లు, వాటి ప్రాధాన్యతలను తెలుసుకోవాలి. అదే విధంగా పర్యావరణ సమస్యలు, పర్యావరణ నిర్వచనం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. అట్లాస్‌పై సమగ్ర అవగాహన తప్పనిసరి. ఫలితంగా ముఖ్యమైన ప్రదేశాల గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం సులువుగా గుర్తించవచ్చు. ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలను సమకాలీన పరిణామాలతో బేరీజు వేసుకోవాలి. ముఖ్యంగా జాగ్రఫీని ఎకానమీతో అనుసంధానం చేసుకోవాలి. వ్యవసాయ, రవాణ సంబంధిత అంశాల విషయంలో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
తెలంగాణలో శాఖల వారీగా గ్రూప్-1 పోస్టుల వివరాలు.. వయోపరిమితి ఇలా .. :
పోస్టు | ఖాళీలు | వయో పరిమితి |
డిప్యూటీ కలెక్టర్ | 42 | 18–44 |
డీఎస్పీ | 91 | 21–31 |
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ | 48 | 18–44 |
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 4 | 21–31 |
జిల్లా పంచాయతీ అధికారి | 5 | 18–44 |
జిల్లా రిజి్రస్టార్ | 5 | 18–44 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్) | 2 | 21–31 |
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 8 | 18–44 |
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 26 | 21–31 |
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2) | 41 | 18–44 |
అసిస్టెంట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమం) | 3 | 18–44 |
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) | 5 | 18–44 |
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) | 2 | 18–44 |
జిల్లా ఉపాధి కల్పనాధికారి | 2 | 18–44 |
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) | 20 | 18–44 |
అసిస్టెంట్ ట్రెజరర్(ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) | 38 | 18–44 |
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సరీ్వస్) | 40 | 18–44 |
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) | 121 | 18–44 |