Skip to main content

TSPSC Groups Preparation Plan: ఎలాంటి ఒత్తిడి.. టెన్ష‌న్ లేకుండా.. గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవ్వండిలా..

పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని చేరవచ్చు. ఆశయసాధనలో అలుపెరగక ముందుకు సాగితే విజయం సాగిలపడుతుంది.
శర్మన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌
శర్మన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌

నిరంతర శ్రమతో.. అకుంఠిత దీక్షతో అహరహం తపిస్తే గెలుపు బాట తథ్యం అంటున్నారు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌. సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో గ్రూప్స్‌ అభ్యర్థులకు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు.

ఈ రెండు అంశాలు కీల‌కం : 
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు సిలబస్‌పై అభ్యర్థులకు అవగాహన అవసరమన్నారు. దానికి అనుగుణంగా మెటీరియల్‌ను సమకూర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాలని, జనరల్‌ నాలెడ్జి పెంచుకోవాలన్నారు. పరీక్షల్లో తొలి మెట్టుకు ఈ రెండు అంశాలు దోహదపడతాయని శర్మన్‌ స్పష్టం చేశారు. 

టీఎస్‌పీఎస్సీ స్టడీ మెటీరియల్

గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే..

Preparation Plan


చదవడంతో పాటు నిరంతరం సమీక్షించు కోవాలి. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు.. ఎంత వరకు అర్థమైందనేది ప్రధానం. ఇష్టంగా అర్థం చేసుకుంటూ చదవాలి. పరీక్షకు హాజరయ్యే లోపు కనీసం రెండుసార్లయినా రివిజన్‌ చేస్తేనే పట్టు వస్తుంది.

ఎంత వరకు రాయాలో..

Exams


గ్రూప్స్‌ అభ్యర్థులకు ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్స్‌ పరీక్షకు లభించే కాల వ్యవధి సరిపోదు. దీంతో ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్‌కు ఒకేసారి సిద్ధం కావడం ప్రారంభించాలి. లాంగ్‌ ఆన్సర్‌ రాయాల్సి ఉంటుంది. రైటింగ్‌ స్కిల్స్‌ పెంచుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష విధానం అర్థమవుతుంది. జవాబు ఎంత వరకు రాయాలో తెలుస్తుంది. ప్రతి దానిని సూక్ష్మంగా గమనించి దానికి అనుగుణంగా సిద్ధమయ్యేందుకు ప్రయత్నించాలి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ సబ్జెక్టులు కీలకం..
గ్రూప్‌ మెయిన్స్‌ కోసం ఆప్షన్లు నిర్ణయించు కోవడం కీలకం. ఆసక్తిని బట్టి ఆప్షన్లు నిర్ణయిం చుకోవాలి. సంబంధిత సబ్జెక్టుల్లో గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే పరీక్ష సునాయాసంగా రాసేందుకు వీలుంటుంది. మెయిన్స్‌ ఇంటర్వ్యూలో సైతం ఆప్షన్స్‌పై అధిక ప్రశ్నలు అడుగుతారు..

సిలబస్‌కు అనుగుణంగా..

Best Plan


రెండు దశాబ్దాల క్రితం వరకు పోటీ పరీక్షలకు సమాచారం సేకరణ కష్టంగా ఉండేది. ప్రస్తుతం గూగుల్‌ సమాచార గనిగా మారింది. అనవసరమైన సమాచారం సేకరించకుండా సిలబస్‌కు అనుగుణంగా  సమాచారం మాత్రమే సేకరించి వాటిపై దృష్టి సారించాలి. 

ఎలాంటి టెన్షన్‌ లేకుండా..
ఇంటర్వ్యూల్లో బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో  సంతృప్తి పర్చగలగాలి. బోర్డు సభ్యుల దగ్గర అభ్యర్థి పూర్తి వివరాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తారు. అందులో వ్యక్తిగత, నేటివిటీ, రాష్ట్రీయ, జాతీయ, సున్నితమైన, ఉద్యోగం సంబంధించి తదితర ప్రశ్నాలు సంధిస్తారు. వాటికి ఎలాంటి టెన్షన్‌ లేకుండా సునాయసంగా జవాబు ఇవ్వాలి. తెలియకుంటే తెలియదని స్పష్టంగా చెప్పాలి. తెలియకున్నా.. చెప్పడానికి ప్రయత్నించవద్దు.

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు..

Plan


పోటీ పరీక్షల్లో సమయ పాలన కూడా ప్రధానం. సమయం వృథా చేయకుండా సంబంధిత సబ్టెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలి. పరీక్ష రాసేటప్పుడు కూడా ముందుగానే  ప్రశ్నలకు సమయం కేటాయించుకొని పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియ‌స్‌పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి

​​​​​​​Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

Published date : 21 Mar 2022 07:15PM

Photo Stories