Skip to main content

TGPSC Group 2 Candidates : భారీగా త‌గ్గిన టీజీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్య‌ర్థుల సంఖ్య‌.. కార‌ణం ఇదే..!

ఇటీవ‌లె తెలంగాణ‌ రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హించిన గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈసారి నిర్వ‌హించిన ఈ గ్రూప్‌ ప‌రీక్ష‌ల‌కు అభ్య‌ర్థుల హాజ‌రు శాతం ఊహించ‌న విధంగా లేద‌ని, అతి తక్కువ మంది అభ్యర్థులు ప‌రీక్ష‌ను పూర్తి చేశార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-2 నిపుణ‌లు ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు.
Drastic fall of candidates attendance for tgpsc group 2 exam 2024   ExpertsTelangana Group-2 exam results with low participation  clarification on low attendance in Telangana Group-2 exams

సాక్షి ఎడ్యుకేష‌న్: డిసెంబ‌ర్ 15, 16వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. ఇందుకు సంబంధించి గ‌తంలో ఎన్నో సార్లు నోటిఫికేష‌న్ను అప్ప‌టి ప్ర‌భుత్వం విడుద‌ల చేసినా కూడా కొన్ని అనుకోని కార‌ణాల వ‌ల్ల ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. ఇలా, ప్ర‌తీ సారి నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయ‌డం, త‌రువాత ర‌ద్దు చేయ‌డం జ‌రుగుతూ ఉండేది.

TSPSC Group-2 Preparation plan: TSPSC Group 2 Exam రాస్తున్నారా.. ఈ త‌ప్పులు చేయోద్దు..

అయితే, రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఈ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసిన‌ప్పుడు ఒక్కో పోస్టుకు వేల‌మంది పోటీకి దిగ‌డం అధికారుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇలా, అతిపెద్ద సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు జ‌రిగాయి. ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తూ ఉన్న అభ్య‌ర్థుల‌కు తీపి క‌బురు వినిపించింది. ఇలా ఎంతో పెద్ద సంఖ్య చేర‌డంతో పోటి చాలానే ఉంటుంద‌ని ఊహించారు అధికారులు.

చివ‌రికి నిరాశే..

గతేడాది జరిగిన గ్రూప్‌-4 పరీక్షలకూ ఇలాగే, భారీ సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు జరిగాయి. అప్పుడు హాజరు 80.20 శాతం న‌మోదైంది. ఎంతో మంది అభ్య‌ర్థులు పరీక్ష‌లో పాల్గొని వారి అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. కాని, ఈసారి అన్ని ఎదురుచూపుల అనంత‌రం విడుద‌లైన నోటిఫికేష‌న్ తో అత్యంత భారీ సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకున్న‌ప్ప‌టికీ హాజ‌రు శాతం మాత్రం స‌గం కూడా లేక‌పోవ‌డం ఆశ్చ‌రానికి గురిచేసింది.

TGPSC Group-2 2024 : గ్రూప్‌-2 ప‌రీక్ష‌కు భారీగా త‌గ్గిన హాజ‌రు శాతం.. కార‌ణం ఇదేనా..!

ఈసారి నిర్వ‌హించిన గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌కు 45 శాతం మాత్రమే న‌మోదైంది. ఇలా, నోటిఫికేష‌న్ విడుద‌ల స‌మ‌యంలో అభ్య‌ర్థుల ఉత్సాహం, ద‌ర‌ఖాస్తుల స‌మ‌యంలో వారి సంఖ్య‌ను చూసి అధికారులంతా పోటీ గ‌ట్టిగా ఉండ‌బోతుంద‌ని ఆశించారు కాని, చివ‌రికి నిరాశే మిగిలింది.

అస‌లు కారణం ఇదేనా..!

ఈసారి ప‌రీక్ష ఒకే సారికి రాకుండా, వాయిదాలు, భారీ పోటీ వంటివి కూడా కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌రీక్ష‌కు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా, నోటిఫికేషన్‌ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం, కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం, ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటి విష‌యాలే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం.

TGPSC Group 2 Exam: గ్రూప్‌–2లో ఉమ్మడి జిల్లా ప్రస్తావన.. పేపర్‌ –4లోనూ..

హాజరుశాతం.. క్రమంగా పతనం..

గత ఏడాది జూలైలో గ్రూప్‌-4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతం.

గ‌తంలో ప్రిలిమ్స్ ప‌రీక్ష‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలోంచి.. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్‌ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17 శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్‌-3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్‌-2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు.

Velichala Jagapathirao History : గ్రూప్‌-2 లో వెలిచాల జ‌గ‌ప‌తిరావు పేరుపై రెండు ప్ర‌శ్న‌లు.. ఆ చ‌రిత్ర ఇదే..!

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి

ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సిద్ధ‌మ‌వుతున్న‌ అభ్యర్థులు వాయిదాల‌తో నిరాశలో కూరుకుపోతున్నారు.

 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు శాతం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. ప‌రీక్ష‌ల‌ను స‌మ‌యంలోనే పూర్తి చేయాలి.
- అబ్దుల్‌ కరీం, సీనియర్‌ ఫ్యాకల్టీ, హైదరాబాద్‌

కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు

ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్‌లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది.

TGPSC Groups Results : టీజీపీఎస్సీ గ్రూప్స్-1,2,3 ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే.. త‌క్కువ స‌మ‌యంలోనే..!

దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి.

- భవాని శంకర్‌ కోడాలి, నిపుణులు, కెరీర్‌ గైడ్‌

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 23 Dec 2024 11:27AM

Photo Stories