TGPSC Group 2 Results : మార్చి 2025లో టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు.. ఈ తరహాలో!
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఎస్‌సి వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది. దీంతో, వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఎస్‌సి వర్గీకరణకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Government Jobs: దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!.. కారణం ఇదే..
ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కోత్త నోటిఫికేషన్లు వచ్చేలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సీ పటిష్ట విధానం రూపొందించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
టీచర్ల పరీక్ష
ఈ కొత్త నోటిఫికేషన్లలో ముందుగా ఉపాధ్యాయల పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్ష వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఇందులో, 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ పరీక్ష కోసం త్వరలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ వెలువడగా, జనవరి 2 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు జరుగనున్నాయి.
TGPSC News: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
వచ్చే ఏడాది గ్రూప్ 2 ఫలితాలు..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15, 16వ తేదీలలో గ్రూప్ -2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఫలితాలతో పాటు గ్రూప్ 1, ఇతర నియామక పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి వచ్చే ఏడాది మార్చి నెలలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా టీజీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ నెల 18, 19 తేదీల్లో అధ్యయనం కోసం బుర్రా వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి), ఛీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సి), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతకలు జరుగకుండా, షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిజేయనున్నారు.
Tags
- tgpsc group 2 results
- group 2 exam results 2024
- Competitive Exams
- govt job notification
- Telangana State Public Service Commission
- UPSC
- group exams results
- telangana govt exams results 2024
- march 2025
- tgpsc group 2 exam results on march 2025
- tgpsc group exams results
- tet and dsc exams
- teachers eligibility tests
- teachers posts exams
- school teacher exams notifications
- tet and dsc 2024
- Telangana Deputy CM Bhatti Vikramarka
- teachers job notification
- National Testing Agency
- Education News
- Sakshi Education News
- StateGovernmentJobs
- NewVacancies
- JobNotifications
- SCClassification