JEE Mains Preparation Tips : జేఈఈ మెయిన్స్‌కు ప్రిపరేషన్ టిప్స్.. వీటిని పాటిస్తే టాపర్ మీరే..!
సాక్షి ఎడ్యుకేషన్: బీటెక్ విద్యను పొందేందుకు ఉత్తమ కళాశాల, లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే పరీక్ష జేఈఈ.. (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్). అయితే, వచ్చే నెల అంటే, జనవరి 2025లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
JEE Mains 2025 Correction Window: జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల్లో సవరణలకు రేపే చివరి రోజు
దేశవ్యాప్తంగా ఈ పరీక్షను జనవరి 22న ప్రారంభమై 31వరకు కొనసాగనుంది. అయితే, ప్రస్తుతం, ఈ పరీక్షకు కేవలం ఒక్క నెల మాత్రమే సమయం ఉంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో ఎలా ఉండాలి, వారి ఆలోచనా విధానాలు ఎలా ఉండాలి, సన్నద్ధత పద్ధతి ఎలా ఉండాలి, పరీక్షకు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. అనే విషయాలను ఇప్పుడు ఒకసారి విద్యార్థుల కోసం..
JEE Main 2025 Exam Session 1: 2025 జనవరి సెషన్ జేఈఈ మెయిన్ కు 12లక్షల మంది దరఖాస్తులు
జేఈఈ విద్యార్థులకు టిప్స్..
1. పరీక్ష సరళి, సిలబస్: జేఈఈ మెయిన్స్‌కి ప్రిపేర్ కావాలంటే మొదట పరీక్ష సరళి, సిలబస్ బాగా తెలుసుకోవాలి. ఇది ప్రాథమిక అవసరం మాత్రమే అంతేకాకుండా అతి ముఖ్యమైనది.
2. హై వెయిటేజీ: అవసరమైన వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి. సిలబస్‌ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనే మూడు విభాగాలుగా విభజించి, అందులోని హై వెయిటేజీ సబ్జెక్టులకు ఎప్పుడూ ప్రాధాన్య ప్రిపరేషన్ ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
3. ఎర్రర్ బుక్ తయారి: ప్రాక్టీస్ చేసే సమయంలో మీరు చేసిన తప్పుల కోసం ఒక నిర్దిష్ట నోట్ బుక్‌ని మెయిటైన్ చేయండి. ప్రతి పరీక్ష, అభ్యాసం కోసం మీరు చేసే చివరి పని ఏమిటంటే.. చేసిన అన్ని తప్పు సమాధానాలను గుర్తించడం! అది అవగాహన తప్పిదం, అజాగ్రత్త దోషం లేదా దశలను వదిలివేయడం.
4. మైక్రో టార్గెట్స్: థర్మోడైనమిక్స్ వంటి ఫిజిక్స్‌లో ఒక నిర్దిష్ట అంశాన్ని పూర్తి చేయడం, గణితంలో ఇంటిగ్రేషన్‌పై కనీసం 50 సమస్యలను పరిష్కరించడం లేదా కెమిస్ట్రీలో పీరియాడిట్ టేబుల్ ధోరణులను సవరించడం వంటి ప్రతి వారానికి మైక్రో టార్గెట్స్‌ని నిర్దేశించుకోండి.
JEE Main 2025 Application Deadline: జేఈఈ మెయిన్స్‌కు అప్లై చేయారా? నేడే చివరి రోజు
5. మూడు దశల పద్ధతి: సమర్థవంతమైన రివిజన్ కోసం మూడు దశల పద్ధతి అవసరం. నోట్స్‌ను ఉపయోగించి ప్రాథమిక అంశాలను రిఫ్రెష్ చేయడానికి శీఘ్ర రివిజ్, అవగాహనను బలోపేతం చేయడానికి మిక్స్డ్ లివెల్ సమస్యలను పరిష్కరించడంతో డీప్ రివిజన్, పరీక్ష పరిస్థితులను అనుకరించడానికి సమయానుకూల క్విజ్‌ల ద్వారా టెస్ట్ రివిజన్.
6. మాక్ టెస్ట్స్ అండ్ పాజిటివిటీ: విద్యార్థులు వారంలో రెండు సార్లు మీరు వారంలో ప్రిపేర్ అయిన సిలబస్‌కు మాక్ టెస్టులు తీసుకోవాలి. ఈ మాక్ టెస్టులతో మీరు ఎంత ప్రిపేర్ అయ్యారనేది మీకే తెలుస్తుంది. దీంతో మీరు ఎక్కడ తక్కువ చదువుతున్నారో, ఎక్కడ మరింత ఫోకస్ పెట్టాలో స్పష్టత వస్తుంది. దీనిని కూడా ఒక ఎగ్జామ్ లాగే చూడండి. అంతేకాకుండా, పరీక్ష పూర్తి అయిపోయి, ఫలితాలు కూడా విడుదలైయ్యే వరకు మీలో మీకు నమ్మకం తప్పకుండా ఉండాలి. ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత మంచిది.
7. ఆరోగ్యం తప్పనిసరి: ఈ పరీక్షల ప్రిపరేషన్‌లో భాగంగా కొందరు విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. ఇది చాలా తప్పు. ఎంత సమయం పరీక్షకు సిద్ధమయ్యేందుకు కేటాయిస్తోరో ప్రతీ ఒక గంట తరువాత ఒక 10 నిమిషాలు బ్రేక్‌కు కేటాయించాలి. ఈ బ్రేక్‌లో బయట వాకింగ్ చేయడం, నలుగురితో సరదాగా మట్లాడడం, కాస్త స్నాక్స్ తినడం లేదా జూస్ తాగడం లాంటివి తప్పకుండా చేయాలి. రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే త్వరగా లేవాలి. ఇది విద్యార్థులకు ఎంతో సహాయపడుతుంది. విద్యార్థులు తమ ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించవద్దు.
Tags
- JEE Mains 2025
- entrance exam for engineering admissions
- jee mains exam 2025
- tips and strategies for jee exam
- students education
- joint entrance exam
- tips and strategies
- students mindset for exams
- jee mains exam 2025 tips for students
- JEE Mains Candidates
- students strategies for jee main 2025
- tips for jee main exam candidates
- engineering college admission exams
- Joint Entrance Exam 2025
- Joint Entrance Exam Main Preparation Process
- jee main exam preparation tips and planning
- iit admissions for students
- Education News
- Sakshi Education News
- B.Tech entrance exam
- JEE preparation tips
- JEE thinking patterns
- JEE exam strategy