TSPSC : గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ‘పాలిటీ’ సబ్జెక్ట్ నుంచి అడిగే ప్రశ్నలు ఇవే..!
ఈ నేపథ్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ‘పాలిటీ’ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో తెలుసుకుందామా...!
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
‘పాలిటీ’.. ఇలా చదివితే ఈజీనే..
గ్రూప్–1లో కీలకమైన మరో విభాగం.. పాలిటీ. ఈ విభాగంలోనూ కోర్, సమకాలీన అంశాల కలయికతో 15 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు భారతీయ రాజకీయ వ్యవస్థకు సంబంధించి.. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు,రాజ్యాంగ లక్షణాలు, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, రాష్ట్రపతి–గవర్నరు వ్యవస్థలు, మంత్రి మండలి, రాష్ట్రపతి, గవర్నర్ ఎన్నికల విధానం–అధికారాలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ ఏర్పాటు–అధికారాలు, సుప్రీం కోర్టు, హైకోర్టులు, న్యాయశాఖ–శాసనశాఖ, న్యాయ –కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం–వివాదాలు, గ్రామీణ పట్టణ స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై పట్టు సాధించాలి. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ప్రిలిమ్స్‌లో పాలిటీలో సంఘటనలు, తేదీలకు కూడా ప్రాధ్యాం ఇవ్వాలి.
తెలంగాణలో శాఖల వారీగా గ్రూప్-1 పోస్టుల వివరాలు.. వయోపరిమితి ఇలా .. :
పోస్టు | ఖాళీలు | వయో పరిమితి |
డిప్యూటీ కలెక్టర్ | 42 | 18–44 |
డీఎస్పీ | 91 | 21–31 |
కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ | 48 | 18–44 |
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ | 4 | 21–31 |
జిల్లా పంచాయతీ అధికారి | 5 | 18–44 |
జిల్లా రిజి్రస్టార్ | 5 | 18–44 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(మెన్) | 2 | 21–31 |
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ | 8 | 18–44 |
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 26 | 21–31 |
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–2) | 41 | 18–44 |
అసిస్టెంట్ డైరెక్టర్ (సాంఘిక సంక్షేమం) | 3 | 18–44 |
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) | 5 | 18–44 |
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) | 2 | 18–44 |
జిల్లా ఉపాధి కల్పనాధికారి | 2 | 18–44 |
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) | 20 | 18–44 |
అసిస్టెంట్ ట్రెజరర్(ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) | 38 | 18–44 |
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(స్టేట్ ఆడిట్ సరీ్వస్) | 40 | 18–44 |
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) | 121 | 18–44 |
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |