Skip to main content

TSPSC Group-1 Prelims: గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఇలా ప్రిపేర‌య్యారంటే..?

తెలంగాణ‌లో మొద‌టిసారిగా 18 విభాగాల్లో 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఇంటర్వ్యూల రద్దుతో రెండంచెల(ప్రిలిమ్స్, మెయిన్స్‌) విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది.
TSPSC Group-1
TSPSC Group 1 Prelims Preparation Tips

ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–1లో మొద‌టి అడుగు అయిన ప్రిలిమినరీ పరీక్షలో కింది వ్యూహాల‌ను అనుస‌రిస్తే విజ‌యం మీదే..!!

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ప్రిలిమినరీ పరీక్ష విధానం ఇదే.. : 
దీనిలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీపై 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ టైప్‌ విధానంలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటాయి. ప్రిలిమినరీ అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులకు మెయిన్‌ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు.

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?​​​​​​​  

ప్రిలిమినరీ ప‌రీక్ష‌కు ఇలా ప్రిపేర‌య్యారంటే..?

Groups


➤ అభ్యర్థులు ముందుగా సిలబస్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. ఆ సిలబస్‌కు సంబంధించి సరైన మెటీరియల్‌ లేదా పుస్తకాలను గుర్తించాలి. సంబంధిత సబ్జెక్టులో ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. ప్రతి అంశాన్ని కాన్సెప్ట్‌ ఆధారంగా చదవాలి. 
➤ జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ సిలబస్‌లో పేర్కొన్న కరెంట్‌ అఫైర్స్‌–ప్రాంతీయ, జాతీయ,అంతర్జాతీయ అంశాలు,అంతర్జాతీయ సంబంధాలు, ఈవెంట్స్‌ ఎంతో కీలకం. గత ఆర్నెల్లలో చోటుచేసుకున్న పరిణామాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ..గత ఏడాది కరెంట్‌ అఫైర్స్‌ను క్షుణ్నంగా చదివితే సులభంగా స్కోర్‌ చేయొచ్చు.
➤ జనరల్‌ సైన్స్‌లో భాగంగా ఆధునిక ఆవిష్కరణలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో దేశం సాధించిన విజయాలపై శ్రద్ధ చూపాలి.
➤ పర్యావరణ అంశాల విషయంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ముఖ్యమైనది. విపత్తుల నిర్వహణ, వాటి నివారణ, ఉపశమన వ్యూహాలను చదవాలి. 
➤ ఎకానమీ, సామాజిక అభివృద్ధి విషయంలో ఇటీవలి తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదికలను చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.
➤ ప్రపంచ, భారతదేశ, తెలంగాణ జాగ్రఫీలో భాగంగా నేలలు, నదులు, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, అడవులు, ప్రాజెక్టులు, పంటల తీరు, ఖనిజ వనరులు తదితర అంశాలపై దృష్టి సారించాలి. 
➤ భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వంను సమగ్రంగా చదవాలి. 
➤ భారతదేశ రాజ్యాంగం, పాలిటీలో భాగంగా రాజ్యాంగం స్వరూపం, లక్షణాలు, సవరణలు, ప్రాథమిక హక్కులు, శాసన అధికారాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాజ్యాంగ సంస్థల ఏర్పాటు తీరు–పని విధానం, స్థానిక సంస్థలు, సంక్షేమ యంత్రాంగంపై పట్టు పెంచుకోవాలి.
➤ దేశంలో పాలన, ప్రభుత్వ పాలసీ, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను క్షుణ్నంగా చదవాలి. 
➤ రాష్ట్రానికి సంబంధించిన సామాజిక అంశాలు, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 
➤ లింగ, కులం, ట్రైబ్‌ తదితర అంశాల్లో సామాజిక అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
➤ లాజికల్‌ రీజనింగ్‌లో అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించిన సగటు, నిష్పత్తి, శాతాలు, నంబర్‌ సిరీస్, కోడింగ్‌–డీకోడింగ్, శాతాలు, కాలం–వేగం, నంబర్‌ సిరీస్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్‌ సమస్యలను సాధన చేయాలి.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

టీఎస్‌పీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్న‌ గ్రూప్‌ –1 పోస్టులు ఇవే.. :

tspsc


➤జిల్లా బీసీ అభివద్ధి అధికారి–2
➤అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌–40
➤అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌–38
➤ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(వైద్యారోగ్యశాఖ)–20
➤ డీఎస్పీ– 91
➤ జైల్స్‌ డిప్యూటీ సూపరిండెంట్‌–2
➤ బఅసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌–8
➤డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌–2
➤జిల్లా మైనారీటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌–6
➤మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2(35)
➤ఎంపీడీవో(121)
➤డీపీవో(5)
➤కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌(48)
➤డిప్యూటీ కలెక్టర్‌(42)
➤అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరిండెంట్‌(26)
➤జిల్లా రిజిస్ట్రార్‌(5)
➤జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌(3)
➤ఆర్టీవో(4)
➤ జిల్లా గిరిజన సంక్షేమాధికారి(2) 
మొత్తం:  503

​​​​​​​Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

Published date : 13 May 2022 01:33PM

Photo Stories