Skip to main content

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?

తెలుగు రాష్ట్రాల్లో త్వ‌ర‌లోనే గ్రూప్ 1, 2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇటీవ‌లే రెండు రాష్ట్రాల్లో గ్రూప్ 1, 2 ఉద్యోగాల‌కు ఇంట‌ర్య్యూల‌ను కూడా ర‌ద్దు చేసిన విష‌యం తెల్సిందే.
TSPSC & APPSC Best Preparation Tips
TSPSC & APPSC Groups Success Plan

ఈ నేప‌థ్యంలో గ్రూప్-1 & 2 పోస్టుల‌కు సంబంధించిన తాజా స‌మాచారం మీకోసం.. 

ఏ బుక్ పడితే ఆ బుక్స్‌..
గ్రూప్స్‌లో సక్సెస్ సాధించాలంటే ఒక సబ్జెక్టు గురించి ఒకటి కంటే ఎక్కువ బుక్స్ చదవడం కంటే.. ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివేలా ప్లాన్ చేసుకోవాలి. గ్రూప్ 1 & 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లు ఏ బుక్ పడితే ఆ బుక్ చదవకూడదు. స్టాండర్డ్ బుక్స్ మాత్రమే చదవాలి. అది వారిని విజయానికి చేరువ చేస్తుంది.
 
చవకబారు పుస్తకాలను..
ఎప్పటి నుంచో గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతూ 5, 10 మార్కులతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పొవడానికి ప్రధాన కారణం.. వారు చదివిన చవకబారు పుస్తకాలు, గైడ్స్. ముందు వాటిని చదవడం మానేయాలి.. వాటికి బదులు తెలుగు యూనివర్సిటీ చెందిన తెలుగు అకాడమీ, లేదా క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ రాసిన పుస్తకాలు చదవాలి. అంతే కానీ కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో పనిచేస్తూ ఆ అనుభవంతో రాసిన బుక్స్‌ని చదవకూడదు. చాలా మంది ఇలా చేయడం వల్లే విజయానికి దూరమయ్యారు. కాబట్టి స్టాండర్డ్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే అభ్యర్థికి ఏది చదవాలో కాదు.. ఏది బుక్ చదవకూడదో తెలియాలి. హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ ఇంటర్ పుస్తకాలు మొదట చదవండి. ఆ తర్వాత డిగ్రీ పుస్తకాలు చదవండి. ఒకవేళ ఇంట ర్‌పై అవగాహన ఉన్నట్లైతే డిగ్రీ పుస్తకాలు చదివిన సరిపోతుంది.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
 
కరెంట్ అఫైర్స్ కోసం..
కరెంట్ అఫైర్స్ కోసం రోజూ న్యూస్‌పేపరు కచ్చితంగా చదివి మీకు రిలేటేడ్‌గా ఉన్న అంశాలను నోట్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఇండియా రేడియో వాళ్లు రోజూ న్యూస్ బ్రాడ్ కాస్ట్ చేస్తుంటారు. అది విని అవసరమైన పాయింట్స్‌ని నోట్ చేసుకోవాలి. రాజ్యసభ టీవీలోనూ ఉపయుక్తమయ్యే వార్తలు వస్తుంటాయి. కోచింగ్ వెళ్లేముందే కనీసం బేసిక్స్ నేర్చుకోండి. అలాగే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) డైలీ ఇస్తున్న క‌రెంట్అఫైర్స్ కూడా చాలా ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశం ఉంది. ప్రతి సబ్జెక్టుకు ఎక్కువ పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదివితే.. ఏ పాయింట్ ముఖ్యం,  ఏదికాదో తెలుస్తుంది.
 
ప్రివియ‌స్‌ క్వశ్చన్ పేపర్స్‌ను...
ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్‌ను చ‌ద‌వడం వల్ల పరీక్ష విధానం తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. 1996 నుంచి 2014 వరకు పరీక్ష విధానంలో చాలా మార్పులు జరిగాయి. స్టేట్ పునర్విభజన జరిగిన తర్వాత పశ్నాపత్రంలో స్టాండర్డ్ బాగా పెరిగింది. కాబట్టి 2014 తర్వాత జరిగిన పరీక్ష ప్రశ్నాపత్రాలు చదవాలి.  సాధారణంగా ఆటల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వారు ఎక్కువ రాణిస్తారని తెలిసిన విషయమే. కాబట్టి ప్రిపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఎగ్జామ్ రాసే వరకు కనీసం 400 నుంచి 500 విషయాలను ప్రాక్టీస్ చేయగలిగితే విజయానికి చేరువవుతాం.
 గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి


ఎలాంటి కోచింగ్ సెంటర్‌ను ఎంచుకోవాలంటే..?
స్టాండర్డ్ ఫ్యాకల్టీ, స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేసి.. మంచి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెట్టే ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే మంచిది. ఎందుకంటే సివిల్స్, గ్రూప్స్‌లో ఉద్యోగం కొట్టిన వాళ్లలో ఎంతో మంది ఓపెన్ యూనివర్సిటీలో చదివినవారు ఉండగా, మంచి కాలేజ్‌లో చదివి కనీసం ప్రిలిమ్స్ కూడా దాటని వారూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నదాంట్లో కాకుండా, స్టూడెంట్స్ తక్కువగా ఉండి మీకేదైనా సందేహం వస్తే తీర్చే అవకాశం ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలి.
                                                                                                                                               -ఆల్ ది బెస్ట్‌

​​​​​​​Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

ఈ ఏడాది (2022) తెలంగాణ‌లో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్-1,2 ఉద్యోగాలు ఇవే..:
గ్రూప్‌-1 పోస్టులు:  503

గ్రూప్‌-2 పోస్టులు : 582

TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

ఏపీ గ్రూప్‌–1, 2 పోస్టుల భ‌ర్తీ ఇలా..
గ్రూప్‌–1లో 110, గ్రూప్‌–2లో 182 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు. గతంలో ప్రకటించిన జాబ్‌ క్యాలండర్‌ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్‌–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్‌–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.

గ్రూప్‌–1 పోస్టులు :

విభాగం

పోస్టులు

డిప్యూటీ కలెక్టర్లు

10

రోడ్‌ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్లు (ఆర్టీవో)

07

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్లు (సీటీవో)

12

జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లు)

06

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి

01

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి

01

జిల్లా బీసీ సంక్షేమ అధికారి

03

డీఎస్పీ (సివిల్‌)

13

డీఎస్పీ (జైళ్లు –పురుషులు)

02

జిల్లా అగ్రిమాపక అధికారి (డీఎఫ్‌వో)

02

అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌

03

మున్సిపల్‌ కమిషనర్‌

01

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2

08

డిప్యూటీ రిజిస్ట్రార్‌ (కోపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌)

02

లే సెక్రటరీ అండ్‌ ట్రెజరర్‌ గ్రేడ్‌–2

05

ఏటీవో/ఏఏవో (ట్రెజరీస్‌ డిపార్ట్‌మెంట్‌)

08

ఏఏవో (డీఎస్‌ఏ) (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)

04

ఏవో (డైరెక్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌)

15

ఎంపీడీవో

07

మొత్తం

110

​​​​​​​

గ్రూప్–2 పోస్టులు..

విభాగం

పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్‌

30

సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

16

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌

15

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3

05

ఏఎల్‌వో (లేబర్‌)

10

ఏఎస్‌వో (లా)

02

ఏఎస్‌వో (లేజిస్లేచర్‌)

04

ఏఎస్‌వో (సాధారణ పరిపాలన)

50

జూనియర్‌ అసిస్టెంట్స్‌ (సీసీఎస్‌)

05

సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)

10

జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)

20

సీనియర్‌ అడిటర్‌ (స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)

05

ఆడిటర్‌ (పే అండ్‌ అలవెన్స్ డిపార్ట్‌మెంట్‌)

10

మొత్తం

182

ఏపీపీఎస్సీ ప‌రీక్ష స్ట‌డీమెటీరియ‌ల్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, సిల‌బ‌స్, గైడెన్స్‌, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 18 Apr 2022 05:18PM

Photo Stories