Skip to main content

TSPSC Group 4 Exam: తుది సమరంలో.. సక్సెస్‌ ఇలా

గ్రూప్‌–4.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో మొత్తం 8,039 పోస్ట్‌ల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్ష! జూలై 1 జరిగే ఈ పరీక్షకు.. దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నట్లు అంచనా! ప్రొఫెషనల్‌ కోర్సుల ఉత్తీర్ణులు మొదలు.. సంప్రదాయ డిగ్రీ పట్టభద్రుల వరకు గ్రూప్‌ 4కు హాజరవుతున్నారు. ఇంతలా పోటీ నెలకొన్న ఈ పరీక్ష కోసం నెలల తరబడి సన్నద్ధత పొందిన అభ్యర్థులు.. పరీక్ష రోజు అనుసరించే వ్యూహమే విజయంలో కీలకంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌–4 అభ్యర్థుల కోసం ఎగ్జామ్‌ డే సక్సెస్‌ టిప్స్‌..
success tips for group-4
  • జూలై 1న గ్రూప్‌–4 పరీక్ష 
  • దాదాపు పది లక్షల మంది పోటీ
  • పరీక్ష రోజు సరైన వ్యూహంతోనే విజయం
  • ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలంటున్న నిపుణులు

☛ TSPSC Group 4 Exam Day Tips & Tricks : TSPSC Group 4 రాత‌ప‌రీక్ష‌లో ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయంటే ?

గ్రూప్‌–4 పరీక్ష రెండు పేపర్లుగా.. 300 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. 

ఒకే రోజున పరీక్ష

గ్రూప్‌–4 పరీక్ష రెండు పేపర్లుగా.. ఒకే రోజున ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరగనుంది. పేపర్‌ 1 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు; పేపర్‌ 2 మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

☛ TSPSC Group 4 Exam News Rules : గ్రూప్‌-4 ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..! ఈ వస్తువులకు నో ఎంట్రీ..

ప్రశ్నపత్రం పరిశీలన

గ్రూప్‌–4 అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రశ్న పత్రం తీసుకున్నాక దాన్ని పరిశీలించేందుకు కనీసం పది నిమిషాల సమయం కేటాయించడం మేలు. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించాలనే తొందరపాటు సరికాదు. తొలుత పూర్తిగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ముందుగా తమకు సులభంగా భావించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అనంతరం ఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అలాకాకుండా ముందే కష్టమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఉపక్రమిస్తే.. మానసికంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది. పర్యవసానంగా తమకు తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించాలి.

ఎలిమినేషన్‌.. అప్రమత్తంగా

ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో అభ్యర్థులు అనుసరించే వ్యూహం..ఎలిమినేషన్‌ టెక్నిక్‌. అంటే.. నా­లుగు ఆఫ్షన్లలో ప్రశ్నకు సరితూగని వాటిని ఒక్కొక్కటిగా తొలగించి.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించడం. ఈ టెక్నిక్‌ను పరీక్ష చివరి దశలోనే అమలు చే­యాలి. తమకు సమాధానాలు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నాకే ఎలిమినేషన్‌పై దృష్టి పెట్టాలి. అలాగే గెస్సింగ్‌ విధానాన్ని కూడా పరీక్ష చివరి దశలోనే అనుసరించాలి.

ఓఎంఆర్‌ షీట్‌.. జాగ్రత్తగా

ఓఎంఆర్‌ షీట్‌లో వివరాలు పొందుపరచడంలో అభ్యర్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా సమాధానాలు బబ్లింగ్‌ చేసేటప్పుడు ప్రశ్న సంఖ్య.. ఆప్షన్‌ను క్షుణ్నంగా గుర్తించాలి. కొంతమంది ఓఎంఆర్‌ షీట్‌ను పూర్తి చేయడంలో పొరపాట్లు చేసి.. సమాధానాలన్నీ సరిగా రాసి మంచి మార్కులు పొందినా కూడా విజయం చేజార్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌ను జాగ్రత్తగా పూరించాలి. 

☛ టీఎస్‌పీఎస్సీ Group 4 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

కమిషన్‌ నిబంధనలు పాటిస్తూ

తాజాగా గ్రూప్‌–4 పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ పలు నిబంధనలు జారీ చేసింది. అభ్యర్థులు వాటిని కూలంకషంగా పరిశీలించాలి. అందుకు అనుగుణంగా సిద్ధమై పరీక్ష హాల్‌కు చేరుకోవాలి. పేపర్‌–1కు ఉదయం 8 గంటల నుంచి పేపర్‌–2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాబట్టి అభ్యర్థులు వీలైనంత ముందుగా పరీక్ష హాల్‌కు చేరుకొని నిబంధనలన్నింటినీ పూర్తి చేయాలి. 

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌

ప్రస్తుతం గ్రూప్‌–4 హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. అభ్యర్థులు వీలైనంత ముందుగా హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవాలి. వీలైతే పరీక్ష రోజుకు ముందుగా ఒకసారి పరీక్ష కేంద్రాన్ని వ్యక్తిగతంగా పరిశీలించడం మేలు. దీనివల్ల పరీక్ష రోజు సరైన సమయానికి చేరుకునే వీలుంటుంది.

ప్రస్తుత సమయంలో.. ఇలా

అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో.. ముఖ్యాంశాలను, సబ్‌ హెడ్డింగ్స్‌ను ఒకసారి చూసుకోవాలి. 
ముఖ్యమైన గణాంకాలు, తేదీలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సొంత నోట్స్‌ రాసుకుని ఉంటే దాని ఆధారంగా పునశ్చరణ పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా షార్ట్‌ నోట్స్, కీ పాయింట్స్, సినాప్సిస్‌లపై ఎక్కువగా దృష్టి సారించాలి. సినాప్సిస్‌ను చదివితే ఆ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మదిలో మెదిలే విధంగా 
ఉండాలి. 

పరీక్షకు ముందు రోజు

పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌ కంటే.. పరీక్షకు హాజరయ్యేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. హాల్‌ టికెట్, పెన్నులు, అవసరమైన గుర్తింపు పత్రాలు అన్నింటినీ దగ్గర పెట్టుకోవాలి.

ఆరోగ్యం జాగ్రత్త

పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు. పరీక్ష ముందు రోజు కూడా ఇలా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు. ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మనసుకు విశ్రాంతి లభించేలా సేద తీరాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరవ్వాలి.

చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

గ్యాప్‌లో చర్చలు వద్దు

గ్రూప్‌ 4 మొదటి పేపర్‌ తర్వాత రెండో పేపర్‌ ప్రారంభానికి రెండు గంటల వ్యవధి ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులు.. సహచరులతో మొదటి పేపర్‌లో గుర్తించిన సమాధానాల గురించి చర్చించడం వంటివి చేయడం సరికాదు. దీనివల్ల అనవసరపు ఒత్తిడి ఏర్పడి రెండో పేపర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

ఎగ్జామ్‌ డే టిప్స్‌

  • వీలైనంత ముందుగా హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి.
  • పరీక్ష రోజు నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
  • సమాధానాలు ఇచ్చే ముందు ప్రశ్న పత్రం పరిశీలనకు సమయం కేటాయించాలి.
  • సులభమైన ప్రశ్నలతో ప్రారంభించి.. ఓ మోస్తరు క్లిష్టత, ఆ తర్వాత బాగా క్లిష్టంగా ఉన్న ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
  • తమకు వచ్చిన అన్ని సమాధానాలు గుర్తించామని భావించాకే గెస్సింగ్, ఎలిమినేషన్‌ విధానాన్ని అనుసరించాలి.

ముఖ్య సమాచారం

  • పరీక్ష తేదీ: జూలై 1(పేపర్‌–1 ఉదయం 10:00 – 12:30; పేపర్‌–2.. మధ్యాహ్నం 2:30–5:00) వరకు.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: పేపర్‌–1 ప్రారంభానికి 45 నిమిషాల ముందు వరకు
  • వెబ్‌సైట్‌: https://tspsc.gov.in/

Published date : 30 Jun 2023 03:51PM

Photo Stories