TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్-3 ఉద్యోగాలు.. పరీక్షా విధానం ఇదే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–3 కేడర్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడింది. 26 ప్రభుత్వ విభాగాల్లో 1,365 ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) డిసెంబర్ 30వ తేదీన (శుక్రవారం) నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. నెలపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఫిబ్రవరి 23ను గడువుగా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ముఖ్యంగా పరీక్షావిధానంపై ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, మోడల్‌పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, గైడెన్స్, ఆన్‌లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీలు మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 పరీక్షావిధానం ఇదే..
మొత్తం మార్కులు: 450
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
Published date : 31 Dec 2022 12:54PM