Skip to main content

MLC Kavitha Demands on TSPSC Group Exams : టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్ష‌ల‌ పేపర్లను రీవాల్యూయేషన్ చేయాల్సిందే... లేదా...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇటీవ‌ల విడుద‌ల చేసిన గ్రూప్‌-1,2 ఫ‌లితాల్లో చాలా మంది అభ్యర్థులకు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారనీ, వాటిని ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని మార్చి 17వ తేదీ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిటిషన్ సమర్పించారు.
brs mlc kavitha demand on tspsc group exams paper revaluation

గ్రూప్‌-1లో ఎన్నో అనుమానాలు..?
టీజీపీఎస్సీ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెల్లడించకపోవడం నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధమని ఎత్తిచూపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు కేటాయించడం వల్ల కూడా విద్యార్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని ఆమె సభ దృష్టికి తీసుకొచ్చారు. క్యాటగిరీ వారీగా వెబ్ నోట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండూ మూడ్రోజుల క్రితం వెబ్ నోట్ పెట్టి మళ్లీ డిలీట్ చేశారనీ, దాంతో విద్యార్థుల అనుమానాలు బలపడుతున్నాయని వివరించారు.

గ్రూప్‌-2లో కూడా..
గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారనీ, అందులో 2.3 లక్షల మంది పరీక్షలు రాశారని తెలిపారు. 13,315 ఓఎంఆర్ షీట్లు ఇన్ వాలీడ్ అయ్యాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెబుతోందనీ, కానీ అందుకు కారణం చెప్పకపోవడంతో విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అలాగే ప‌బ్లిక్ స‌ర్వీస్ కమిషన్ విడుదల చేసిన ప్రాథమిక కీ కి, ఫైనల్ కీ కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయనీ, దాంతో మార్కులు తగ్గి ఉద్యోగావకాశాలకు గండి పడిందని తెలిపారు. 

☛➤ TSPSC Group 2 Problems : గ్రూప్‌-2లో ఈ 13000 మంది అభ్యర్థుల సంగ‌తి ఏమిటి...? ఇన్‌వాలిడ్‌కు కారణం ఇదేనా..?

తెలుగు మీడియం అభ్యర్థుల విషయంలోనూ...
తెలుగు మీడియం అభ్యర్థుల విషయంలోనూ అన్యాయం జరిగిందని అంటున్నారనీ, ముఖ్యంగా తెలుగు రాని అధ్యాపకులు పేపర్లు దిద్దడం వల్ల అనువాద సమస్య ఏర్పడి మార్కులు తక్కువగా వచ్చాయన్నారు. గ్రూప్ 4 విషయంలోనూ అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. లోకల్, నాన్ లోకల్ ఆప్షన్ లేదని, దాంతో మల్టీజోన్లో ఎక్కడ నియామకాలు చేపడుతారో స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. ఇలా ఎన్నో త‌ప్పులు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన గ్రూప్స్ ప‌రీక్ష‌ల్లో ఉన్నాయ‌ని... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

Published date : 19 Mar 2025 09:04AM

Photo Stories