TGPSC Group 2 Topper Success Story: సివిల్స్, గ్రూప్స్‌కు ఇంట్లోనే ప్రిపేర్ కావొచ్చు: సచిన్ రెడ్డి

సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి సివిల్స్, గ్రూప్స్‌కు ప్రిపేర్ అవడం పూర్తి స్థాయిలో ప్రారంభించానని తెలిపారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదలైన సందర్భంగా ‘సాక్షి’ ఆయన్ను పలకరించింది. ఆయన మాటల్లో..
సిద్దిపేటలోనే విద్యాభ్యాసం ప్రారంభం..
7వ తరగతి వరకు సిద్దిపేటలోని గ్రేస్ గ్రామర్ స్కూల్, 8 నుంచి 10వ తరగతి వరకు కేకేఆర్, హైదరాబాద్‌లో, ఇంటర్ నారాయణ కాలేజీ, బీటెక్ ఢిల్లీలోని ముంజాల్ యూనివర్సిటీలో పూర్తి చేశాను. 2019–2021 వరకు స్ట్రింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసి 2021లో సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేశాను. 2021, 2022లో రెండు సార్లు సివిల్స్ రాసినా క్వాలిఫై కాలేదు.
పరీక్షల వాయిదాతో
2022లో గ్రూప్–2కు దరఖాస్తు చేశాను. కానీ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. అలాగే గ్రూప్–1 కూడా పోస్ట్‌పోన్ అవుతుంటే డిస్టర్బ్ అయ్యాను. మళ్లీ సాఫ్ట్‌వేర్ సైడ్ పోదామా అనిపించింది. అప్పుడు అమ్మానాన్న సుజాత, శ్రీనివాస్‌రెడ్డి, అన్నయ్య నితిన్ రెడ్డి, తాతయ్య వెంకట్ రెడ్డి ఎంతో ఎంకరేజ్ చేశారు.
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా
గ్రూప్–2లో 444.754 మార్కులు అలాగే గ్రూప్–1లో 461.5 మార్కులు సాధించాను. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక కూడా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతాను. ప్రిపరేషన్ కు రోజుకు 8 నుంచి 10 గంటలు, అదే పరీక్షలు 2 నెలలు ఉన్న సమయంలో 10 నుంచి 12 గంటలు చదివాను.
చదవండి: TGPSC Group 1 Topper Success Story: ఒకటే లక్ష్యం.. అది సాధించే వరకు ప్రయత్నం: హరవర్ధన్ రెడ్డి
ఆన్ లైన్ కోచింగ్ తీసుకుంటూ, టెస్ట్‌లు రాస్తూ నేను ఎక్కడ వీక్ ఉన్నానో తెలుసుకుని దాన్ని ఎక్కువగా ప్రిపేర్ అయ్యాను. సివిల్స్, గ్రూప్స్‌కు ఇంట్లో ఉండి ప్రిపేర్ కావచ్చు. సిలబస్ తెలుసుకుని, వాటికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్‌ను ఎంపిక చేసుకుని చదవవచ్చు. నేను ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యే వారికి హార్డ్ వర్క్ ఎంతో ముఖ్యం. ఇది షార్ట్‌కట్‌ల ద్వారా, రోజుకో గంట చదివితే రాదు. కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టాలి.
![]() ![]() |
![]() ![]() |
Tags
- Sachin Reddy Group 2 Topper
- Sachin Reddy Success Story
- Group 2 Rank 2 Sachin Reddy
- Civil Services Preparation at Home
- How to Prepare for Groups at Home
- Best Strategy for Group 2 Preparation
- Group 1 and Group 2 Topper Tips
- Sachin Reddy IAS Aspirant
- Group 2 Online Coaching Benefits
- Best Books for Group 2 Preparation
- TSPSC Group 2 Topper Story
- Telangana Group 2 Ranker Tips
- UPSC and TSPSC Exam Preparation
- Civil Services Study Plan