Skip to main content

TSPSC Group 4 Exam News Rules : గ్రూప్‌-4 ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..! ఈ వస్తువులకు నో ఎంట్రీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి జులై 1వ తేదీన రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ ప‌రీక్ష కోసం తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తోంది.
TSPSC Group 4 Exam 2023 Rules in Telugu
TSPSC Group 4 Exam 2023 Rules

ప్రభుత్వ విభాగాల్లో 8,180 గ్రూప్‌-4 పోస్టులకు జులై 1న నిర్వహించనున్న రాతపరీక్షకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌ను రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు.

చ‌ద‌వండి: Group 4 Preparation Tips: 9,168 గ్రూప్‌-4 పోస్టుల‌పై.. గురిపెట్టండిలా!

TSPSC గ్రూప్‌-4 ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే.. 

tspsc group 4 exam day tips

☛ గతంలో జరిగిన ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ పకడ్భందీగా ఎగ్జామ్స్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. 
☛ ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరు. 
☛ మధ్యాహ్యం ఎగ్జామ్ 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కమిషన్ స్పష్టం చేస్తోంది. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి కేంద్రంలోకి అనుమతించనున్నారు.

చదవండి: Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..! 
☛ ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కమిషన్ కోరుతోంది. 
☛ ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని కమిషన్ సూచించింది. ఇంకా షూలు ధరించి రావొద్దని.. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని తెలిపింది. 
☛ అభ్యర్థులను తనిఖీ తరువాత కేంద్రంలోకి అనుమతించనున్నారు. దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో వేలిముద్రను తప్పనిసరి చేశారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందించి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. 

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!
☛ ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్ కు అభ్యర్థులు ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ.. అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషన్ స్పష్టం చేస్తోంది. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సదురు అభ్యర్ధిని మిగతా అన్ని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటించనున్నట్లు తెలిపింది. 

☛ టీఎస్‌పీఎస్సీ Group 4 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
☛ ఓఎంఆర్ షీట్లో బ్లూ/బ్లాక్ పెన్ తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. 
☛ హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని కమిషన్ స్పష్టం చేస్తోంది.

చ‌ద‌వండి: TSPSC Group 3 Exam Pattern : 1365 గ్రూప్‌-3 ఉద్యోగాలు.. ప‌రీక్షా విధానం ఇదే..

Published date : 30 Jun 2023 04:04PM

Photo Stories