Skip to main content

Group 4 Preparation Tips: 9,168 గ్రూప్‌-4 పోస్టుల‌పై.. గురిపెట్టండిలా!

గ్రూప్‌-4 సర్వీసెస్‌.. రాష్ట్ర స్థాయిలో.. గ్రూప్స్‌ అభ్యర్థులంతా పోటీ పడే పరీక్ష! అకడమిక్‌ నేపథ్యంతో సంబంధం లేకుండా.. సివిల్స్, గ్రూప్‌-1, 2, 3 అభ్యర్థులు సైతం రాసే పరీక్ష గ్రూప్‌-4! కారణం.. సర్కారీ కొలువు సొంతం చేసుకోవాలనే అభిలాష! తాజాగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)..గ్రూప్‌-4 సర్వీసెస్‌లో 9,168 పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది! దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది!! ఈ నేపథ్యంలో.. గ్రూప్‌-4 పోస్టుల వివరాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
Group 4 Preparation Tips
 • 9,168 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల
 • ఈ నెల 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
 • పది లక్షల మందికిపైగా పోటీపడతారని అంచనా
 • పటిష్ట ప్రణాళికతోనే విజయం సాధ్యం అంటున్న నిపుణులు

గ్రూప్‌-4 సర్వీసెస్‌ అనేది గ్రూప్స్‌ కేటగిరీలో కింది స్థాయి పోస్టులుగా భావిస్తారనుకుంటే పొరపాటే.ఎందుకంటే..ఈ పోస్ట్‌ల కోసం డిగ్రీ మొదలు పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులు సైతం పోటీ పడుతుంటారు. దీంతో గ్రూప్‌-4 సర్వీసులను లక్ష్యంగా చేసుకున్న వారు పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలపై అవగాహన పెంచుకొని పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగించాలి అంటున్నారు నిపుణులు.

చ‌ద‌వండి: TSPSC Group 4 Notification: 9,168 గ్రూప్‌-4 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

25 శాఖలు.. 9,168 పోస్ట్‌లు

టీఎస్‌పీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో.. జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ ఆడిటర్, వార్డ్‌ ఆఫీసర్‌ హోదాల్లో.. 9,168 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ఈ నెల 23 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ పరీక్షకు పోటీ పడే వారి సంఖ్య పది లక్షల వరకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రూప్‌-1,2,3 సర్వీసులకు పోటీ పడే ప్రతి ఒక్కరూ గ్రూప్‌-4కు కూడా హాజరవుతారని చెబుతున్నారు. 

రెండు పేపర్లుగా రాత పరీక్ష

 • టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4ను రెండు పేపర్లుగా.. 300 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్‌ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. 
 • ఇందులో పేపర్‌ 1 జనరల్‌ నాలెడ్జ్‌ 150 మార్కులకు, అలాగే పేపర్‌ 2 సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

ప్రిపరేషన్‌ దిశగా

 • గ్రూప్‌-4 అభ్యర్థులు ప్రతి టాపిక్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా ప్రిపరేషన్‌ సాగించాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది, కానీ.. అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రశ్న-సమాధానం అనే విధానంలో కాకుండా.. అభ్యర్థులకు ఆయా అంశాలపై ఉన్న అవగాహనను పరీక్షించే విధంగా ఇన్‌డైరెక్ట్‌ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే.. డిస్క్రిప్టివ్‌ అధ్యయనం చాలా అవసరం. ఆయా అంశాలపై బేసిక్స్‌ మొదలు సమకాలీన అంశాల వరకు పూర్తి స్థాయి అవగాహన పొందాలి.

చ‌ద‌వండి: TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

సిలబస్‌ అధ్యయనం

గ్రూప్‌-4 అభ్యర్థులు ప్రిపరేషన్‌కు ఉపక్రమించే ముందు.. రెండు పేపర్లకు సంబంధించి సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఫలితంగా ఆయా విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అంశాలు, చదవాల్సిన టాపిక్స్‌పై అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ఆయా అంశాలకు లభించే వెయిటేజీపైనా ప్రాథమిక అంచనాకు వచ్చే వీలుంటుంది. 

చ‌ద‌వండి: APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్‌ రాసుకుని.. గుర్తు పెట్టుకోవ‌డం ఎలా..?

ముఖ్యాంశాలతో నోట్స్‌

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు ముఖ్యమైన అంశాలతో నోట్స్‌ రాసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తుది దశ ప్రిపరేషన్‌లో పునశ్చరణను వేగంగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. రివిజన్‌ సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను చదవాల్సిన అవసరం లేకుండా.. ఆయా టాపిక్స్‌కు సంబంధించి కీలకమైన విషయాలను చదవుతూ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. 

పేపర్‌-1కు ఇలా

గ్రూప్‌-4 సర్వీసెస్‌ నియామక పరీక్షలో మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంది.

వెయిటేజీపై అవగాహన

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో ముందుగా ఆయా అంశాలకు లభించే వెయిటేజీపై ప్రాథమికంగా ఒక అంచనా ఏర్పరచుకోవాలి. ఈ పేపర్‌లో పదకొండు విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అంటే.. 150 మార్కులకు నిర్వహించే పరీక్షలో.. ఒక్కో విభాగం/అంశం నుంచి 12 నుంచి 13 ప్రశ్నలు చొప్పున అడిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ప్రాంత ప్రాధాన్యత అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే వీలుంది. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాల గురించి ఎక్కువ అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఉద్దేశాలు తెలుసుకోవాలి.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

 • కరెంట్‌ అఫైర్స్,ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ విభాగాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయని అంచనా వేయొచ్చు. ఈ రెండు అంశాల ప్రిపరేషన్‌లో అభ్యర్థులు శాస్త్రీయంగా వ్యవహరించాలి. దినపత్రికల్లో ప్రతి రోజు అనేక సమకాలీన పరిణామాల సమాచారం ప్రచురితమవుతుంది. వీటి నుంచి పరీక్ష కోణంలో ప్రశ్నార్హమైన పరిణామాలను గుర్తించడం ఎంతో కీలకం. ఇందుకోసం అభ్యర్థులు ముందుగా ఆయా అంశాలను మూడు విభాగాలుగా(ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ) విభజించుకోవాలి. ఆ తర్వాత ఆ మూడు విభాగాల వార్తలు/తాజా ఘటనల్లో సామాజికంగా ప్రభావితం చేసే పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ముఖ్య నియామకాలపై దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశ ప్రమేయం, అదే విధంగా భారత్‌పై ప్రభావం చూపే అవకాశమున్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు.. వచ్చే ఏడాది జి-20 సదస్సు నిర్వహణను భారత్‌కు అప్పగించడం, ఇటీవల ముగిసిన క్వాడ్‌ కూటమి సమావేశాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. 
 • హిస్టరీలో కీలక సంఘటనలు, అవి జరిగిన సంవత్సరాలను గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు చరిత్రలో కీలకంగా భావించే ప్లాసీ యుద్ధం జరగడానికి కారణాలు ఏంటి? ప్లాసీ యుద్ధం పర్యవసానం? వంటి భిన్న కోణాల నుంచి చదవాల్సిన అవసరం ఉంటుంది.
 • పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ పీఠిక, ముఖ్యమైన ఆర్టికల్స్, ప్రకరణలు, సవరణలను అధ్యయనం చేయాలి. 
 • ఎకానమీలో ప్రాథమిక అంశాలతోపాటు ఇటీవల కాలంలో ఆర్థిక విధానాలు, అభివృద్ధి కారక పథకాలు, సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, పథకాల లక్ష్యం వంటి అంశాలను ఔపోసన పట్టాలి. 
 • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి బేసిక్‌ సైన్స్‌ అంశాలతోపాటు నిజ జీవితంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర, ఇటీవల కాలంలో ఈ రంగంలో తాజా పరిణామాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాటి వల్ల ప్రయోజనాలు వంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. 
 • జాగ్రఫీలో భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతాలు, ఖనిజ వనరులు, సహజ వనరులు,నదీ తీర ప్రాంతాలు,అడవులు-రకాలు, పంటలు-అవి ఎక్కువగా పండే ప్రాంతాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.
 • జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీలో రాణించేందుకు దత్తాంశాల విశదీకరణ, టేబుల్స్, గ్రాఫ్స్‌ను పరిశీలించి వాటిలోని ముఖ్యాంశాలను గుర్తించే విధంగా అధ్యయనం చేయాలి. 
 • పంచాయతీ రాజ్‌ వ్యవస్థ, సహకార సంఘాలు, స్థానిక సంస్థలు, సహకార ఉద్యమం తదితర అంశాలను ఔపోసన పట్టాలి. 

పేపర్‌-2.. ప్రత్యేకంగా

 • గ్రూప్‌-4లో పేపర్‌-2గా నిర్వహించే సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ కోసం మరింత ప్రత్యేకంగా కృషి చేయాలి. అర్థమెటిక్, రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఇంగ్లిష్‌ గ్రామర్‌ అంశాలపై పట్టు సాధించాలి. 
 • అర్థమెటిక్‌కు సంబంధించి సింపుల్‌ ఇంట్రెస్ట్, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్,లాభ నష్టాలు, లాస్, శాతాలు, త్రికోణమితి, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్‌ అంశాలపై పట్టు సాధించాలి.
 • రీజనింగ్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సిరీస్‌(నంబర్‌/ ఆల్ఫా న్యుమరిక్‌), అనాలజీస్, ఆడ్‌మన్‌ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్‌ ఫార్మేషన్, బ్లడ్‌ రిలేషన్స్, నాన్‌ వెర్బల్‌(వాటర్‌ ఇమేజ్, మిర్రర్‌ ఇమేజ్‌), కోడింగ్‌ డీకోడింగ్‌ మొదలైన టాపిక్స్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి.
 • ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ కోసం..వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రెహెన్షన్, గ్రామర్‌లపై పట్టు సాధించాలి. బేసిక గ్రామర్‌ అంశాలుగా భావించే సినానిమ్స్, యాంటానిమ్స్, ఇడియమ్స్‌/ఫ్రేజెస్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్స్, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, స్పెల్లింగ్‌ మిస్టేక్స్, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌ విభాగాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఈ విభాగం నుంచి ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు రీడింగ్‌ కాంప్రహెన్షన్‌పై మరింత శ్రద్ధ చూపాలి. అదే విధంగా సదరు ప్యాసేజ్‌లోని కీలక అంశాలను గుర్తించే విధంగా నైపుణ్యం పొందాలి.

చ‌ద‌వండి: TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేర‌య్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చ‌దివారంటే..

గ్రూప్‌ 2,3తో సమన్వయం

 • గ్రూప్‌-4 రాసే అభ్యర్థులు గ్రూప్‌-2, 3 సర్వీసులకు కూడా పోటీ పడతారు. వీటికి కూడా నోటిఫికేషన్‌ మరికొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది. సమన్వయం, అనుసంధాన దృక్పథంతో ఒకే సమయంలో ఈ మూడు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా అడుగులు వేయాలి. గ్రూప్‌ 2, 3, 4ల్లో ఉమ్మడి సిలబస్‌ను, ఆయా పరీక్షలకు ప్రత్యేకంగా పేర్కొన్న టాపిక్స్‌తో జాబితా రూపొందించుకోవాలి. దీనికి అనుగుణంగా ఉమ్మడి అంశాలకు, వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకునేలా వ్యవహరించాలి.
 • ఇలా.. ఆయా అంశాలకు లభించే వెయిటేజీ అంచనా మొదలు తుది దశంలో రివిజన్‌ వరకూ.. నిర్దిష్ట వ్యూహంతో, పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే.. గ్రూప్‌-4లో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4.. ముఖ్యాంశాలు

 • మొత్తం 25 శాఖల్లో 9168 పోస్ట్‌ల భర్తీ.
 • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: డిసెంబర్‌ 23-జనవరి 12. 
 • ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లుగా గ్రూప్‌-4 పరీక్ష. 
 • ప్రాంతీయ ప్రాధాన్యం గల అంశాలపై ప్రత్యేక దృష్టితో మంచి మార్కులు.
 • అన్వయ దృక్పథంతో చదివితే ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.
Published date : 14 Dec 2022 05:54PM

Photo Stories