TSPSC & APPSC Groups Best Books: గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఈ పుస్తకాలను చదివారంటే..
సరిగ్గా ఇలాంటి కీలకమైన సమయంలో.. చాలామంది అభ్యర్థులు పుస్తకాలు లేదా మెటీరియల్ ఎంపికలో.. తడబాటుకు గురవుతున్నారు!! మార్కెట్లో.. ఒక్కో సబ్జెక్ట్‌కు పదుల సంఖ్యలో పుస్తకాలు, ప్రచురణలు! ఈ నేపథ్యంలో కింది ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకుంటే మీ ప్రిపరేషన్‌కు సరిగ్గా ఉపయోగపడతాయి.
గ్రూప్స్‌కు ఎంపిక చేసుకోవాల్సిన ముఖ్యమైన పుస్తకాలు ఇవే..
➤ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు(6 నుంచి 12వ తరగతి వరకు)
➤ అకాడమీ పుస్తకాలు
➤ బ్యాచిలర్ డిగ్రీ స్థాయి పుస్తకాలు
➤ కేంద్ర, రాష్ట్ర సామాజిక– ఆర్థిక సర్వేలు, బడ్జెట్ ప్రచురణలు
➤ ఇండియా ఇయర్ బుక్, యోజన, ఈపీడబ్ల్యూ
➤ జాగ్రఫీ: ఇండియన్ జాగ్రఫీ–మాజిద్ హుస్సేన్, వరల్డ్ జాగ్రఫీ–మాజిద్ హుస్సేన్
➤ ఎకానమీ: ఇండియన్ ఎకానమీ–ఉమా కపిల; ఇండియన్ ఎకానమీ–మిశ్రా అండ్ పూరి; ఎకనామిక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్–ఎం.ఎల్.జింగన్
➤ పాలిటీ: ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్–ఎస్.పి.వర్మ; డెమోక్రసీ ఇన్ ఇండియా–రషీదుద్దీన్ ఖాన్; ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా–పి.ఎం.భక్షి; ఇన్‌ట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా–డి.డి.బసు; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – అవస్థి అండ్ మహేశ్వరి చాప్టర్స్ ఆన్ గుడ్ గవర్నెన్స్; ఇండియన్ పాలిటీ–లక్ష్మికాంత్.
TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట కోసం.. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణుల సూచనలు- సలహాలు ..
➤ హిస్టరీ: ఏన్షియంట్ ఇండియా–ఆర్.ఎస్.శర్మ; మిడీవల్ ఇండియా–సతీష్ చంద్ర; మోడ్రన్ ఇండియా–బిపిన్ చంద్ర.
➤ సైన్స్ అండ్ టెక్నాలజీ: సైన్స్ స్పెక్ట్రమ్, యోజన, ప్రభుత్వ ప్రచురణలు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలకు సంబంధించిన అంశాలను చదివేటప్పుడు అకాడమీ పుస్తకాలకు, వాటి తాజా ప్రచురణలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
➤ అదే విధంగా శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్, రాష్ట్ర పునర్విభజన చట్టం, రాష్ట్రాల విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అమలవుతున్న పథకాలు, సమస్యలకు సంబంధించి ప్రభుత్వ ప్రచురణలు చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!