APPSC&TSPSC: గ్రూప్స్‌కు సొంతంగా నోట్స్ రాసుకుని.. గుర్తు పెట్టుకోవడం ఎలా..?
అయితే చాలామంది అభ్యర్థులు పుస్తకాలు లేదా మెటీరియల్ ఎంపికలో..తడబాటుకు గురవుతున్నారు! మార్కెట్లో.. ఒక్కో సబ్జెక్ట్‌కు పదుల సంఖ్యలో పుస్తకాలు, ప్రచురణలు! దీంతో.. ఏ పుస్తకాన్ని ఎంచుకోవాలి.. ఏ పుస్తకంలో ఎంత సమాచారం ఉంది.. ఆ సమాచారాన్ని ఎలా చదవాలి.. సిలబస్‌కు అనుగుణంగా సొంతం నోట్స్ రాసుకోవడం ఎలా..? ఇలా ఎన్నో సందేహాలు!! ఇలాంటి కీలక నేపథ్యంలో.. గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సొంతంగా నోట్స్ రాసే విధానం.. టిప్స్.. మీకోసం..
సొంతగా నోట్స్ రాసుకునే టిప్స్..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు సొంత నోట్స్ రాసుకునే విధానాన్ని పాటించాలి. ఇది వారికి మలి దశలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు, గత విజేతలు చెబుతున్నారు. ఈ సొంత నోట్స్ రాసుకునే విషయంలో కూడా అభ్యర్థులు కొంత గందరగోళానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఇలాంటి అభ్యర్థులు.. ఏదైనా అంశాన్ని చదువుతున్నప్పుడు ముందుగా వాటి ప్రాథమిక భావనలు నోట్స్‌లో పొందుపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిని సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ.. తగిన సమాచారాన్ని సదరు నోట్స్‌లో రాసుకోవాలి.
☛ గణాంకాలు, ముఖ్యమైన ఘట్టాలు, సంవత్సరాలు ఉండే ఎకానమీ, హిస్టరీ వంటి వాటికి ఆయా సంవత్సరాల్లో జరిగిన సంఘటనల ప్రాధాన్యతను బట్టి నోట్స్‌లో రాసుకోవాలి.
☛ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు.. ఆయా పథకాల లక్ష్యం, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, ఆర్థిక కేటాయింపులు, సదరు పథకాల ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలను నోట్స్‌లో రాసుకోవాలి.
☛ బడ్జెట్, సామాజిక సర్వేల్లో ఎక్కువగా గణాంకాలే ఉంటాయి. కాబట్టి పరీక్ష ప్రాధాన్యత ఆధారంగా వాటిని నోట్స్‌గా పొందుపర్చుకోవాలి. వాటికి సమకాలీన అంశాలను అనుసంధానం చేసుకునేలా వ్యవహరించాలి.
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
గుర్తు పెట్టుకోవడం ఎలా ?
☛ విస్తృతమైన సమాచారంతో ఉండే పుస్తకాలను చదివేటప్పుడు ఆయా అంశాలను గుర్తుంచుకోవడం ఎలా? అనే ఆందోళన కూడా కలుగుతుంది. దీనికి పరిష్కారంగా అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యం ఆధారంగా మెమొరీ టిప్స్ పాటించాలి.
☛ ముఖ్యమైన అంశాలను పాయింట్స్‌గా రాసుకోవడం; విజువలైజేషన్ టిప్స్‌ను పాటించడం; పిక్టోరియల్ అప్రోచ్(అంటే ఆయా అంశాలకు సంబంధించి చార్ట్‌లు, డయాగ్రమ్స్ రూపంలో పొందుపర్చుకోవడం) వంటి వాటిని అనుసరించాలి. ఈ మెమొరీ టిప్స్ అనేవి అభ్యర్థుల వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
వీటికే అధిక ప్రాదాన్యత ఇవాలి...
☛ గ్రూప్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య.. గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలా? లేదా కాన్సెప్ట్‌లు ముఖ్యమా అనేది? ఇది అభ్యర్థులు చదివే అంశం, పోటీ పడే పరీక్ష స్థాయిపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.
☛ పథకాలు లేదా వనరుల కేటాయింపునకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు గణాంకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాటిని సమకాలీన అంశాలతో సమ్మిళితం చేసుకోవాలి. కాన్సెప్ట్యువల్ ప్రిపరేషన్ ఉపయుక్తంగా ఉంటుంది.
☛ ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే గ్రూప్–2లో గణాంకాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కేవలం గ్రూప్–2కే పోటీ పడే అభ్యర్థులు ఆయా గణాంకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
☛ గ్రూప్–1, 2 రెండింటికీ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్2కు ప్రిపరేషన్ సాగిస్తూనే.. గ్రూప్1 మెయిన్స్ పరీక్షను పరిగణనలోకి తీసుకుని డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది.
☛ ఇలా..మెటీరియల్ ఎంపిక నుంచి పరీక్ష స్థాయి వరకూ..ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ..శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేస్తే..పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది.