Skip to main content

High court Order on TSPSC Group 4 Jobs : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 నియామకాలపై హైకోర్టు కీల‌క‌ ఆదేశం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్ర‌క్రియ‌ తుది తీర్పునకు లోబడి ఉండాల‌ని హైకోర్టు స్పష్టం చేసింది. TSPSC గ్రూప్‌-4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబరులో జారీ నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేట జిల్లాకు చెందిన దేవత్‌ శ్రీను, దేవత్‌ తనుశ్రీతో పాటు మరో ముగ్గురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశారు.
High court Order on TSPSC Group 4 Jobs 2024

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వర్సెస్‌ కేంద్రం కేసులో 2014లో సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి సెప్టెంబరు 4న హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇదే హైకోర్టు ట్రాన్స్‌జెండర్లకు సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. 

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

ఈ 10 రోజుల్లో..
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వాదనలు వినిపిస్తూ కౌంటరు దాఖలు చేయడానికి 10 రోజుల గడువు కావాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటరు దాఖలుకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తూ.., ఈలోగా చేపట్టే నియామక ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉంటుందంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

 Common Test For All Government Jobs : ఇక‌పై అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఉమ్మడి పరీక్ష.. రానున్న నోటిఫికేష‌న్‌ల‌లో..!

Published date : 05 Sep 2024 01:08PM

Photo Stories