Skip to main content

TSPSC Group 4 District Wise Jobs Details 2024 : గ్రూప్‌-4 పోస్టులు జిల్లాలు, రిజర్వేషన్లు వారీగా కేటాయింపు వివరాలు ఇలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-4 పోస్టులకు సంబంధించి మహిళలకు జీవో నెంబర్ మూడు ప్రకారం హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ ఒక ప్రకటన విడుదల చేశారు.
TSPSC Announcement on Horizontal Policy Implementation for Group-4 Positions    TSPSC Group 4 District Wise Jobs Details 2024    TSPSC Announcement    Telangana State Public Service Commission Horizontal Policy for Women

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టులకు సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌లోని ఇతర అంశాలను మార్పు చేయలేదని స్పష్టం చేశారు. గత నెలలో గ్రూప్-4 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ధ్రువపత్రాల పరిశీలనకు వివరాలను టీఎస్పీఎస్సీ ప్రకటించనుంది.

తెలంగాణ గ్రూప్‌-4 ప‌రీక్ష‌ను 2023 జూలై 1వ తేదీన నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. అందులో 7,62,872 మంది పేపర్-1 రాశారు. 7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు. 

గ్రూప్‌-4 పోస్టులు జిల్లాలు, రిజర్వేషన్లు వారీగా కేటాయింపు ఇలా..

Published date : 26 Mar 2024 10:11AM
PDF

Photo Stories