Skip to main content

TSPSC Group 4: ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన ఈ అభ్యర్థులకు వైద్య పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువప త్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావలసి ఉంటుందని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్‌ జూలై 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Group-4 recruitment process   Government job selection criteria  Telangana government employment news  Medical Tests for TSPSC Group IV Blind Candidates  Telangana Public Service Commission

అంధ అభ్యర్థులు జూలై 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహి దీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డు ఎదుట ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. సూచించిన తేదీల్లో అభ్యర్థులు ఉదయం 8 గంటల కల్లా ఆస్పత్రిలో ఉండాలని పేర్కొన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

మెడికల్‌ బోర్డు పరీక్షలకు హాజరయ్యేటప్పుడు అభ్యర్థులు హాల్‌టికెట్, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, అంధత్వ నిర్ధారణ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. తేదీల వారీగా మెడికల్‌ బోర్డు షెడ్యూల్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. 

Published date : 03 Jul 2024 01:11PM

Photo Stories