Skip to main content

Telangana Group -2 News : యథావిధిగా తెలంగాణ గ్రూప్‌–2 పరీక్షలు ... పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చిం చెప్పిన హైకోర్టు

Telangana High Court decision on Group-2 exam dates  Telangana Group -2 News: యథావిధిగా తెలంగాణ గ్రూప్‌–2 పరీక్షలు ... పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చిం చెప్పిన హైకోర్టు
Telangana Group -2 News: యథావిధిగా తెలంగాణ గ్రూప్‌–2 పరీక్షలు ... పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చిం చెప్పిన హైకోర్టు

హైదరాబాద్‌: ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్‌–2 పరీక్షలను వాయిదా వేయలేమ ని హైకోర్టు తేల్చిం చెప్పింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌కు స్ప ష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ ఆర్‌బీ) పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్‌–2 పేపర్‌–3, పేపర్‌–4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితోపాటు మరో 21 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ అంశంపై కమిషన్‌కు నవంబర్‌ 25నే వినతిపత్రం సమ ర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీ క్‌ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాది స్తూ 15, 16న జరగనున్న గ్రూప్‌–2 పరీక్షలకు దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందిపడతారని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో గ్రూప్‌–2 పరీక్షను నిలిపేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ముఖ్య కార్యదర్శి, టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.

ఇదీ చదవండి: Telangana Group -2 News : గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం

గ్రూప్‌–2 హాల్‌టికెట్లు విడుదల 
గ్రూప్‌–2 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ సోమవారం హాల్‌టికెట్లను విడుదల చేసింది. కమిషన్‌ వెబ్‌సైట్‌లో వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కమిషన్‌ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లాలవారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 040–22445566/ 23542185/23542187కు కాల్‌ చేసి లేదా  helpdesk@tspsc.gov.in కు ఈ–మెయిల్‌ చేయాలని సూచించారు. తొలిరోజే లక్ష మందికిపైగా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

ఇదీ చదవండి: UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 10 Dec 2024 11:47AM

Photo Stories