Skip to main content

TSPSC Group 4 Result 2023 : దసరా పండ‌గ త‌ర్వాత‌నే గ్రూప్ 4 ఫ‌లితాలు.. మెరిట్‌ జాబితా కూడా.. ఎన్ని ప్ర‌శ్న‌లు తొల‌గించారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించిన గ్రూప్‌-4 ఫ‌లితాల విడుద‌ల‌పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేపథ్యంలో ఇక గ్రూప్‌-4 మెరిట్ జాబితాను కూడా విడుదల చేయాలని కమిషన్‌ భావిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాల ఆధారంగా మెరిట్‌ జాబితా ఉంటుంది.
tspsc group 4 results news telugu
tspsc group 4 results 2023

ప్రస్తుతం రాష్ట్రంలో దసరా ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ కూడా నడుస్తోంది. దసరా పండగ తరువాత మెరిట్‌ జాబితా ఇవ్వాలని యోచిస్తున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టతపై కొంత ఆలస్యం కానుంది. ఇక ఎన్నికల కోడ్‌ కూడా పూర్తైన అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితాలు ప్రకటించనుంది.

☛ TSPSC Group-4 Final Key Released : గ్రూప్‌-4 ఫైనల్ 'కీ' ఇదే.. భారీగా తొల‌గించిన ప్ర‌శ్న‌లు ఇవే.. 


తెలంగాణ‌లో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కీ కూడా ఇటీవల విడుదలైంది. ఇందుకు సంబంధించిన జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను కూడా వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. TSPSC గ్రూప్-4 పరీక్షకు మొత్తం 9,51,205 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 1న జరిగిన పరీక్షలో... పేపర్-1లో 7,63,835 మంది అభ్యర్థులు, పేపర్-2లో 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తొల‌గించిన ప్ర‌శ్న‌లు ఇవే..

tspsc group 4 deleted questions telugu news


గ్రూప్‌ 4 ఆన్సర్ కీ లో మొత్తం 10 ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లకు కలిపి మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేసింది. ఫైనల్ కీలో.. TSPSC గ్రూప్-4 పేపర్-1 నుంచి ఏడు ప్రశ్నలు.. అలాగే పేపర్-2 నుంచి మూడు, మొత్తం పది ప్రశ్నలను తొలగించింది. ఇంకా, రెండు పేపర్లలో కలిపి మొత్తం 13 ప్రశ్నలకు సమాధానాలలో మార్పులు చేయబడ్డాయి, ఐదు ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఇంతటితో గ్రూప్‌ 4 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయినట్లైంది. దసర పండ‌గ త‌ర్వాత ఏ క్ష‌ణంలోనై గ్రూప్‌-4 ఫ‌లితాలు విడుల‌య్యే అవ‌కాశం ఉంది.

☛➤ TSPSC Group 4 Paper-1 Question Paper With Key 2023 (Click Here)

☛➤ TSPSC Group 4 Paper-2 Question Paper With Key 2023 (Click Here)

Published date : 19 Oct 2023 02:43PM

Photo Stories