TS VRO Problems Due to New Group 4 Employees : పాపం వీఆర్‌వోలకు ఎన్ని కష్టాలో.. కొత్త గ్రూప్-4 నియామకాలతో.. ఎలా అంటే..?
తిరిగి తమను ఏ ప్రాతిపదికన.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు..? ఇప్పటికే తమకు పోస్టులు లేక ఎగనిస్ట్ పోస్టుల్లో నియమించిన కలెక్టర్లు.. ఇప్పుడు ఎక్కడ నియమిస్తారని, తమ సర్వీస్ మ్యాటర్లు, ఉద్యోగ భద్రత ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే రోస్టర్ పాయింట్ల ద్వారా నోటిఫికేషన్ వెలువరించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోనే.. వీఆర్‌వోలను గత ప్రభుత్వ పాలనలో రీడెప్లాయ్ చేశారు. కానీ సీనియారిటీ ప్రకారం అడ్జస్ట్ చేయలేదు. దీంతో వాళ్లు రికార్డుల్లో పేరుకే శాశ్వత ఉద్యోగులుగా మారారు. రెండేండ్లు గడిచినా నిబంధనల ప్రకారం తాత్కాలిక ఉద్యోగులుగానే చెలామణి అవుతూ సీనియారిటీని కోల్పోతున్నారు. నాడు రీడెప్లాయ్ చేసేటప్పుడు నోరు మెదపని జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు.. నేడు ఆ పోస్టులు గ్రూప్ 4 ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ రూపంలో నోటిఫై చేసినవని కొర్రీలు పెడుతున్నారు.
ఇలాంటి సమస్యలతో.. వీఆర్‌వోలను ఉక్కిరిబిక్కిరి..?
ఇప్పటికే అన్ని సర్వీస్ నిబంధనలు ఉల్లంఘనకు గురై తీవ్ర నష్టాల పాలైనా వీరి సమస్యలకు మోక్షం ఎప్పుడు..? కొత్త ఆర్‌ఓఆర్-2024 చట్టం ద్వారా వీరికి సైతం సత్వరమే పరిష్కారం చూపే అవకాశం ఉందా..? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో రీడెప్లాయిడ్ వీఆర్‌వోలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కొన్ని చోట్ల నాల్గో తరగతి ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చేందుకు పూర్వ వీఆర్వోలకు రికార్డు అసిస్టెంట్ హోదాకు మారుస్తున్నారు. సొసైటీలు (మైనార్టీ, మహాత్మా జ్యోతిబాఫూలే, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)లో నియమితులైన వీఆర్వోలకు అక్కడ ఉన్న నిబంధనల మేరకు సీనియారిటీ ప్రకారం సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి రావాల్సి ఉంది.
కొందరిని...
కానీ ప్రభుత్వం వారిని తిరిగి రెవెన్యూలో సర్దుబాటు చేస్తారనే ప్రకటన నేపథ్యంలో వారికి పదోన్నతులు ఎందుకు? వెనక్కి వెళ్లండి.. అంటూ అండర్ టేకింగ్ ఇవ్వాలని కొర్రీలు పెడుతున్నారు. దీంతో సుమారు 70 మందికి అక్కడి నిబంధనల మేరకు పదోన్నతి ఆగిపోయింది. కొందరిని ఎగనిస్ట్ పోస్టుల్లో సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, వార్డెన్, తోటమాలి, డ్రైవర్ వంటి పోస్టుల్లో నియమించారు. ఈ సమస్యలన్నీ ఇలా ఉండగానే వారితో నింపిన చాలా వరకు పోస్టులు గతంలో గ్రూప్-4 పరీక్ష ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీకి నిర్దేశించినవే.
పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో..
ఇటీవల సంబంధిత అభ్యర్థుల ఎంపిక పూర్తవగా వారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో చాలా శాఖల్లో ఖాళీలు లేవు. దీంతో అక్కడ ఉన్న పూర్వ వీఆర్వోలను వెంటనే ఆ పోస్టుల నుంచి రిలీవ్ చేయించి, వాటిని గ్రూప్-4 సెలెక్టెడ్ అభ్యర్థులకు ఇవ్వాలని సంబంధిత శాఖాధిపతులు జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేస్తున్నారని సమాచారం. అలా వీలు కాని పక్షంలో సంబంధిత జిల్లా కలెక్టర్లకు వివరించి తాత్కాలిక ప్రాతిపదికన రీడెప్లాయిడ్ వీఆర్వోలను సర్దుబాటు చేసేలే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే మంచిర్యాల, పెద్దపల్లి, హన్మకొండ, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో 60 పోస్టులు గ్రూప్ -4 అభ్యర్థులకు కేటాయించాల్సి ఉంది. కానీ ఇప్పటికే అక్కడ 37 మంది వీఆర్వోలను నియమించారు. దీంతో వీరిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలాంటి పరిస్థితి సూర్యాపేట, మహబూబాబాద్, ఇతర అన్ని కొత్త మెడికల్ కాలేజీల్లోనూ ఉంది.
పూర్వ వీఆర్ఏలను..
గ్రూప్-4లో రెవెన్యూ శాఖ (భూ పరిపాలన, స్టాంప్స్, రిజిస్ట్రేషన్లు, లాండ్ రికార్డ్స్, వాణిజ్య పన్నులు)లో 1,200 పోస్టులుగా పేర్కొన్నారు. కానీ ఇప్పటికే రెవెన్యూలో ఖాళీలు లేక సుమారు 1600 మంది పూర్వ వీఆర్ఏలను సూపర్ న్యూమరరీ ప్రాతిపదికన, రోస్టర్ పాయింట్లు లేకుండానే నియమించారు. ఈ నేపథ్యంలో నల్లగొండలో 54 పోస్టులను గ్రూప్-4 ద్వారా నోటిఫై చేయగా.. ప్రస్తుతం నాలుగు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అలాగే చాలా శాఖల్లో అక్కడి మాతృ శాఖ సిబ్బంది పదోన్నతులకు పూర్వ వీఆర్వోల రీడెప్లాయిమెంట్ వల్ల తీవ్ర సీనియారిటీ సమస్యలు ఎదురవుతున్నాయి.
మా గోడు వినిపించుకోని...
ఎగ్జిక్యూటిక్ విధులు నిర్వర్తించిన తాము గత ప్రభుత్వపు నిర్వాకం వల్ల తాత్కాలిక ఉద్యోగులుగా మారి ఉద్యోగ భద్రత, సామాజిక గుర్తింపు, నేరుగా ప్రజా సేవ చేసే అవకాశం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకురానున్న రెవెన్యూ యాక్ట్ -2024లో భాగంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇప్పటికే చాలా నష్టపోయిన రీడెప్లాయ్ వీఆర్వోల విషయంలో ప్రభుత్వం ఏదైనా కమిటీని వేసి తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ ప్రభుత్వం అయిన మా గోడు వినిపించుకోని మాకు న్యాయం చేయాలి కోరుతున్నారు.
Tags
- TSPSC Group 4
- TSPSC Group 4 Rules
- TS VRO Problems Due to New Group 4 Employees
- TS Old VRO Problems Due to New Group 4 Employees
- TS Old VRO Problems Due to New Group 4 Employees news in Telugu
- vro jobs in telangana 2024 notification
- vro jobs in telangana 2024 notification news in telugu
- ts vro problems and solutions
- ts vro problems
- ts vro problems news in telugu
- ts vro service rules
- ts vro service rules news in telugu
- ts vro service rules telugu
- ts vro duty rules
- ts vro duty rules news in telugu
- TS VILLAGE REVENUE OFFICERS ACT 2024
- TSPSC Group 4 Jobs
- tspsc group 4 jobs candidates
- tspsc group 4 jobs selected candidates list 2024
- tspsc group 4 jobs 2024
- Bad News TS VRO Problems Due to New Group 4 Employees