Skip to main content

APPSC Group 4 Final Key : ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 ప్రిలిమ్స్ ఫైన‌ల్ 'కీ' ఇదే.. ఈ సారి 'కీ' లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ గ్రూప్‌-4 ఉద్యోగాలైన జూనియర్‌ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల ఫలితాలను అక్టోబ‌ర్ 12వ తేదీన‌ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

ఈ ఫ‌లితాల‌తో పాటు జూనియర్‌ అసిస్టెంట్ (గ్రూప్‌-4) ప్రిలిమ్స్ ఫైన‌ల్ కీ ని కూడా విడుద‌ల చేశారు. 670 గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఏపీపీఎస్సీ ఈ ఏడాది జులై 31న ప‌రీక్ష‌ నిర్వహించిన విష‌యం తెల్సిందే. 

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. ఈ ఫ‌లితాల‌ను జిల్లాల వారిగా ఇచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 పరీక్షకు 2,11,341 మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

APPSC : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 సిల‌బ‌స్ ఇదే.. || APPSC Group-1 Best Books || APPSC Group1 Notification Details

అలాగే మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు కమిషన్‌ తెల్పింది. ఈ మెయిన్స్ ప‌రీక్ష ఆన్‌లైన్ విధానంలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రెవెన్యూ శాఖలో భ‌ర్తీ చేస్తారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఫైన‌ల్ కీ ఇదే..:

Published date : 13 Oct 2022 12:52PM
PDF

Photo Stories