TSPSC Group 4 Current Affairs Bits : గ్రూప్–4 రాతపరీక్షలో.. 'కరెంట్ అఫైర్స్' నుంచి ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఇవే.. ఇవి చదివితే చాలు..
ఈ నేపథ్యంలో.. గ్రూప్-4 పేపర్-1 మొత్తం 150 ప్రశ్నలకు పరీక్ష ఉంటే.. కరెంట్ అఫైర్స్ విభాగం నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి.
కరెంట్ అఫైర్స్‌ను ముఖ్యంగా.. పరీక్ష తేదీకి ముందు 6 నుంచి 9 నెలల కాలానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ను చదవాలి. ప్రశ్నలు ఏ విధంగా అడిగినా.. సమాధానాలు గుర్తించేలా ప్రిపరేషన్ సాగించాలి. అలాగే కరెంట్ ఆఫైర్స్‌లో భాగంగానే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు వస్తాయి. నిత్యజీవితంలో అంతర్భాగంగా సైన్స్ టెక్నాలజీపై ప్రశ్నలు ఎదురవుతాయి.
వచ్చే ప్రశ్నలు ఇవే..
మన దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలపై ప్రధానంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో ముఖ్యంగా సరిహద్దు దేశాలతో భారతదేశానికి ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు వచ్చే వీలుంది. అంతర్జాతీయ సంఘటనలు, ప్రపంచ వేదికల్లో భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్ అనుసంధానించుకొని చదివితే మేలు. వివిధ అంతర్జాతీయ వేదికలు, వాటి ప్రారంభం, పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశ పాత్ర, ఆయా వేదికల సభ్య దేశాలు, వాటి పూర్వ, ప్రస్తుత అధ్యక్షులు, తాజా సమావేశాలు, రష్య–ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
గ్రూప్-4లో కరెంట్ అఫైర్స్‌కు.. ముఖ్య అంశాల గుర్తింపే కీలకం..
కరెంట్ అఫైర్స్.. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకున్న అవగాహన తెలుసుకునేందుకు ఉద్దేశించిన విభాగం ఇది. గ్రూప్-4 పరీక్షల్లో దాదాపు 30 నుంచి 40 శాతం మేరకు కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలు అడిగే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించాలనుకునే వారికి సామాజిక, సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమే కరెంట్ అఫైర్స్ అంటున్నారు నిపుణులు.
సమాధానం ఇవ్వగలిగేలా..
కొంతకాలంగా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్న ప్రశ్నల తీరు మారుతోంది. నేరుగా కరెంట్ అఫైర్స్ సంబంధిత ప్రశ్నలు మాత్రమే కాకుండా.. కోర్ అంశాలతో సమ్మిళితం చేస్తూ కూడా అధిక సంఖ్యలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కొత్త బిల్లులు లేదా ఆర్డినెన్స్‌లు తెస్తున్న విషయం తెలిసిందే. సదరు బిల్లులకు సంబంధించి సమకాలీన పరిణామం, దాని నేపథ్యం,బిల్లు ప్రవేశపెట్టేందుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలిస్తేనే.. సమాధానం ఇవ్వగలిగేలా కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు తాజా పరిణామాలతోపాటు కోర్ సబ్జెక్ట్‌లోని మూల భావనలపైనా అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ విభాగాన్ని తీసుకున్నా..
కరెంట్ అఫైర్స్ అనేది ఒక సముద్రం లాంటిది. ప్రతి రోజు ఎన్నో కొత్త పరిణామాలు సంభవిస్తుంటాయి. జాతీయం,అంతర్జాతీయం,సైన్స్, స్పోర్ట్స్.. ఇలా ఏ విభాగాన్ని తీసుకున్నా.. ప్రతిరోజు అనేక సంఘటనలు జరుగుతుంటాయి. వీటిలో పరీక్షల కోణంలో ముఖ్యమైనది ఏదో గుర్తించడం ఎలా.. అనే ప్రశ్న అభ్యర్థులకు ఎదురవుతోంది. ఇలాంటి అభ్యర్థులు విస్తృత ప్రాధాన్యం, ఎక్కువ ప్రభావం చూపే సంఘటనలపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలి. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాంతీయ సంఘటనలను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్దేశిత అంశం నేపథ్యాన్ని పరిశీలించాలి. అలాగే ఆర్థిక, సామాజిక,విద్య, పరిపాలన ప్రాధాన్యం కలిగిన జాతీయ అంశాలను ముఖ్యమైనవిగా పరిగణించాలి.
అంతర్జాతీయ అంశాలు ఇలా పట్టు సాధిస్తే..
అంతర్జాతీయ పరిణామాల్లో ప్రతి అంశాన్ని చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన వాటిపై దృష్టిపెడితే సరిపోతుంది. ఉదాహరణకు.. సదస్సులు, సమావేశాలకు సంబంధించి ప్రతిదానికి తేదీలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయా సదస్సుల్లో విడుదల చేసిన డిక్లరేషన్లను, 'వాటి థీమ్' ను నోట్ చేసుకోవాలి. అదే విధంగా ఆయా సదస్సుల నిర్వహణ ఉద్దేశం తెలుసుకోవాలి.
మన దేశానికి, ఇతర దేశాలకు మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలకు అభ్యర్థులు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటితో మన దేశానికి ఒనగూరే ప్రయోజనాలు, అంతర్జాతీయంగా లభించే గుర్తింపు వంటి అంశాలను తెలుసుకోవాలి. వాస్తవానికి కరెంట్ అఫైర్స్ విభాగంలో..'జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు' అని సిలబస్‌లో పేర్కొంటున్నారు. ఆ 'ప్రాధాన్యం' ఉన్న అంశాలను గుర్తించే నేర్పును అభ్యర్థులు సొంతం చేసుకోవాలి. అంతర్జాతీయంగా, జాతీయంగా జరిగే ప్రతి సమావేశాన్ని, లేదా సంఘటనను చదువుకుంటూ వెళ్లకుండా.. అవి చూపే ప్రభావం, వాటి ప్రయోజనం, ఉద్దేశం ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్–4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
నివేదికలు, గణాంకాలను ముఖ్యంగా..
తాజాగా విడుదలయ్యే నివేదికలు,గణాంకాలకు సంబంధించి ప్రాంతీయ ప్రాధాన్యమున్న అంశాలపై ముందుగా దృష్టిపెట్టాలి. తర్వాత ఆ నివేదికలను విడుదల చేసిన సందర్భాన్ని గుర్తించాలి. ఉదాహరణకు..కోవిడ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికల్లో.. మహమ్మారి కారణంగా మన దేశంపై పడిన ప్రభావం, జీవనోపాధి, వలస కూలీల పరిస్థితులు, వ్యాక్సినేషన్ వంటి కీలక అంశాలను చదివితే సరిపోతుంది. ఇలా చదివే సమయంలో సంబంధిత గణాంకాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఇది ప్రిపరేషన్ చివర్లో, పరీక్షకు ముందు రివిజన్‌కు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో..
కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్‌లో సాక్షి ఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com) వచ్చే కరెంట్ అఫైర్స్ చాలా కీలకంగా నిలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి విస్తృతమైన మెటీరియల్ సాక్షి ఎడ్యుకేషన్.కామ్ అందుబాటులో ఉంది.
చదవండి: Current Affairs Practice Tests(TM)
పేపర్ రీడింగ్ ద్వారా కూడా..
కరెంట్ అఫైర్స్ విషయంలో ఎక్కువ మంది అభ్యర్థులు దినపత్రికలపై ఆధారపడుతుంటారు. ప్రతి రోజు పేపర్ చదువుతూ ముఖ్య సంఘటనల గురించి అవగాహనకు ప్రయత్నిస్తుంటారు. పేపర్ రీడింగ్ విషయంలోనూ ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి. సమకాలీన అంశాలపై ప్రచురితమయ్యే ఎడిటోరియల్స్, ఇతర ముఖ్యమైన వ్యాసాలు చదివేటప్పుడు వాటి ఉద్దేశాన్ని గుర్తించాలి. ఆ తర్వాత వాటి సారాంశాన్ని ముఖ్యమైన పాయింట్ల రూపంలో నోట్స్‌లో రాసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను గుర్తించే నైపుణ్యం పెంచుకోవాలి.
చదవండి: Current Affairs Practice Tests(EM)
సొంత నోట్స్ ఇలా..
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్య సంఘటనలను సొంత నోట్స్‌లో రాసుకోవాలి. ఒక టాపిక్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను రాసుకునే క్రమంలో.. భవిష్యత్తుల్లో పునశ్చరణకు ఉపయోగపడేలా రూపొందించుకోవాలి. పుస్తకంలో లేదా న్యూస్ పేపర్స్‌లో కనిపించే సమాచారం మొత్తాన్ని నోట్స్‌లో పొందుపర్చకుండా.. వాటికున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని సంక్షిప్తంగా రాసుకోవాలి.
కరెంట్ అఫైర్స్.. మెమొరీ టెక్నిక్స్ ఇలా..
కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మెమొరీ టెక్నిక్స్‌ను పాటించడం. ప్రతి అభ్యర్థికి తనకంటూ సొంత మెమొరీ టెక్నిక్స్ ఉంటాయి. కొందరు విజువలైజేషన్ టెక్నిక్స్, కొందరు మైండ్ మ్యాపింగ్(మనసులోనే ఆయా అంశాలను ముద్రించుకునే విధానం) వంటివి అనుసరిస్తారు. మరికొందరికి ఆయా అంశాలను టేబుల్స్, గ్రాఫ్స్‌లో రూపంలో రాసుకుని సులువుగా జ్ఞప్తికి తెచ్చుకునే లక్షణం ఉంటుంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఉండే విధానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇలా.. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు,కోర్ టాపిక్స్‌తో అనుసంధానం, మంచి పుస్తకాల ఎంపిక, పేపర్ రీడింగ్ వరకూ.. అడుగడుగునా శాస్త్రీయంగా ప్రిపరేషన్ సాగిస్తే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
Also read: గ్రూప్-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..