TSPSC Group 4 Geography Questions : గ్రూప్–4 రాతపరీక్షలో.. 'జాగ్రఫీ' నుంచి అడిగే ప్రశ్నలు ఇవే..
ఈ నేపథ్యంలో.. గ్రూప్-4 పేపర్-1 మొత్తం 150 ప్రశ్నలకు పరీక్ష ఉంటే.. ఇందులో ముఖ్యమైన జాగ్రఫీ నుంచి ..భారతదేశ భౌగోళిక అంశాలపై ప్రశ్నలుంటాయి. బేసిక్ స్థాయిలోనే వీటిని అడిగే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్‌లో స్కూల్, డిగ్రీ స్థాయి పుస్తకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మేలు చేస్తుంది.
వీటిపై పట్టు ఉండాల్సిందే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 జనరల్ స్టడీస్‌లో తెలంగాణ జాగ్రఫీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇటీవల పోటీ పరీక్షల్లో భూగోళశాస్త్రం ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన వివిధ నియామక పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే తెలంగాణా నేపథ్యానికి చెందిన అంశాలపై ప్రశ్నలు అధికంగా వస్తున్నట్లు గమనించవచ్చు. మార్కుల సాధనలో తెలంగాణా జాగ్రఫీ అంశాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు తెలంగాణా ఉనికి, నైసర్గిక స్వరూపం, రాష్ట్ర సరిహద్దులు, రాష్ట్రంలో ప్రవహించే నదులు, ముఖ్యమైన చెరువులు,ప్రాజెక్టులు, శీతోష్ణస్థితి, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు మొదలైన వాటి గురించి క్షుణ్నంగా చదవాలి.
జాగ్రఫీ కోణంలోనే..
తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఈ ప్రాంతంలోని ముఖ్యమైన సెజ్‌లు, ఎకనామిక్ జోన్‌లు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, తాజా వ్యవసాయ పరిస్థితులు, పర్యావరణ సమస్యలు, రవాణా వ్యవస్థ గురించి అధ్యయనం చేయాలి. అదే విధంగా తెలంగాణ ప్రాంతంలోని జనాభా స్థితిగతులు, వారు నివసిస్తున్న ప్రాంతాలు గురించి తెలుసుకోవాలి. జాగ్రఫీ కోణంలోనే పారిశ్రామికీకరణ కూడా చదవాలి.