Organ Donation: అవయవదాతల్లో.. పురుషుల కంటే... మహిళలే ఎక్కువ
అవయవ దానంతో చిరంజీవులుగా నిలిచిపోయి, మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే దాతలు ప్రతి ఏటా పెరుగుతున్నారు. దేశంలో 2019లో 12,666 అవయవ దానాలు జరగ్గా, 2023లో ఈ సంఖ్య 18,3785కి పెరిగింది.
➣ 2023లో మొత్తం అవయవదానం చేసినవారి సంఖ్య 16,542, జరిగిన మొత్తం అవయవదానాల సంఖ్య 18,378.
➣ 2023లో అత్యధికంగా 13,426 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌లు, 4,491 కాలేయ ట్రాన్స్ ప్లాంటేషన్‌లు జరిగాయి.
➣ గుండె మార్పిడి 221 మందికి జరగ్గా, ఊపిరితిత్తుల మార్పిడి 197 మందికి జరిగాయి.
➣ బతికి ఉండి అవయవదానం చేసిన వారిలో మహిళలే ఎక్కువ కావడం విశేషం. వారి సంఖ్య 9,784 కాగా, మగవారి సంఖ్య 5,651.
Nijut Moina Scheme: బాల్య వివాహాలను అరికట్టేందుకు కొత్త పథకం ప్రారంభం
రాష్ట్రాలవారీగా చూస్తే.. తాము మరణిస్తూ మరో లునగురికి జీవితాన్నిచ్చిన వారు తెలంగాణలో ఎక్కువ. అక్కడ 252 మంది అవయవదానం చేశారు. తరవాతి స్థానాల్లో 178 మందితో తమిళనాడు, కర్ణాటక, 148 మందితో మహారాష్ట్ర, ఆ 146 మందితో గుజరాత్, 66 మందితో ఢిల్లీ, 41 మందితో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి.