TSPSC Group 4 Economy Questions : గ్రూప్–4 రాతపరీక్షలో.. 'ఎకానమీ' నుంచి అడిగే ప్రశ్నలు ఇవే.. ఈ అంశాలపై పట్టు ఉంటే చాలు..
పాఠశాల స్థాయి బేసిక్ అంశాలతో ప్రారంభించి, భారత ఆర్థిక సర్వే, బడ్జెట్లపైన స్థూలంగా అవగాహన పెంచుకోవాలి. స్థూల గణంకాలపై అవగాహన ఉండాలి. ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్, సాంఘిక ఆర్థిక సమస్యలైన నిరుద్యోగం,పేదరికం, మౌలిక భావనలు తెలుసుకోవాలి. వాటిని నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రస్తుతం అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విత్త, ద్రవ్య వ్యవస్థలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
ఈ ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తే..
➤ ప్రగతి, అభివృద్ధి: భావనలు, పరస్పర సంబంధం.
➤ ఆర్థికాభివృద్ధి గణన: జాతీయాదాయం, నిర్వచనం, జాతీయాదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, నామమాత్ర, వాస్తవ ఆదాయం.
➤ పేదరికం, నిరుద్యోగం: పేదరికం భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం- నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
➤ భారత ఆర్థిక ప్రణాళిక: పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక; సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :
➤ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1954-2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దుర్వినియోగం
➤ నీళ్లు (బచావత్ కమిటీ), నిధులు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి కల్పన (జై భారత్ కమిటీ, గిర్‌గ్లాన్ కమిటీ).
➤ తెలంగాణలో భూ సంస్కరణలు: మధ్యవర్తిత్వ విధానాల నిర్మూలన - జమీందారీ, జాగిర్దారీ, ఇనాందారీ, టెనాన్సీ విధానాలు, భూ పరిమితి, షెడ్యూల్డ్ ఏరియాల్లో ల్యాండ్ ఎలియేషన్.
➤ వ్యవసాయం, సంబంధిత రంగాలు: జీఎస్‌డీపీలో వ్యవసాయం, సంబంధిత రంగాల పాత్ర, భూ పంపిణీ, వ్యవసాయంపై ఆధారం, నీటి పారుదల, జల వనరులు, మెట్ట భూముల్లో సాగు ఇబ్బందులు.
➤ పారిశ్రామిక, సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; పారిశ్రామిక ప్రగతి, నిర్మాణం - చిన్న, సూక్ష్మ తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ); పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవా రంగం నిర్మాణం, ప్రగతి.
అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, పరిణామాలు :
☛ అభివృద్ధిలో గతిశీలత: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు - కులం, తెగ, లింగ, మత ప్రాతిపదిక అసమానతలు; వలసలు, పట్టణీకరణ.
☛ అభివృద్ధి, స్థానచలనం: భూసేకరణ విధానం; పునరుద్ధరణ, పునరావాసం
☛ ఆర్థిక సంస్కరణలు: ప్రగతి, పేదరికం, అసమానతలు-సాంఘిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక రూపాంతరత, సాంఘిక భద్రత.
☛ సుస్థిర అభివృద్ధి: భావనలు, గణన, లక్ష్యాలు.