Skip to main content

TSPSC Group 4 Results: గ్రూప్‌–4 పరీక్షల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 8,180 గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించిన అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును ఫిబ్ర‌వ‌రి 9న‌ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది.
TSPSC Group-4 eligibility test rankings  TSPSC Group-4 vacancy eligibility test results   February 9 TSPSC results  Release of General Ranking List of TSPSC Group 4 Exams  TSPSC general ranking list

ఈ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల కోసం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... గతేడాది జూలై 1వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఓఎంఆర్‌ ఆధారితంగా పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పేపర్‌–1(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 762872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2 పరీక్షకు 761198 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పరీక్షలకు హాజరైన అభ్యర్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేసిన టీఎస్‌పీఎస్సీ.... తాజాగా 7,26,837మంది అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను త్వరలో షార్ట్‌లిస్ట్‌ చేసి వెల్లడించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి నవిన్‌ నికోలస్‌ ఫిబ్ర‌వ‌రి 9న‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులను ఈ జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. 

Published date : 10 Feb 2024 11:10AM

Photo Stories