Group 4: 5న గ్రూప్–4 అభ్యర్థులకు సీపీటీ పరీక్ష
Sakshi Education
నెల్లూరు(దర్గామిట్ట): రెవెన్యూశాఖలో జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో సీపీటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 5వ తేదీ ఉదయం కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారని, అర్హత సాధించిన అభ్యర్థులు సీపీటీ పరీక్షకు హాజరుకావాలని తెలిపారు. హాల్‌టిక్కెట్, ఆధార్‌కార్డు, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఫొటో ప్రూఫ్‌లతో పరీక్షకు హాజరుకావాలని తెలిపారు.
APPSC & TSPSC 2023 : ఈ వీడియో చూస్తే.. పోటీపరీక్షల్లో 40 మార్కులు గ్యారెంటీ..!
Published date : 31 Jul 2023 01:50PM