Skip to main content

Telangana Tenth Class Exams News:తెలంగాణ పదో తరగతి తొలి రోజే పేపర్ 1 ప్లేస్ లో పేపర్ 2 ..

Telangana Tenth Class Exams News:తెలంగాణ పదో తరగతి తొలి రోజే పేపర్ 1 ప్లేస్ లో పేపర్ 2 ..
Telangana Tenth Class Exams News:తెలంగాణ పదో తరగతి తొలి రోజే పేపర్ 1 ప్లేస్ లో పేపర్ 2 ..

తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఆరంభమైన తొలి రోజే జిల్లాలో గందరగోళం చోటు చేసుకుంది. ఒక ప్రశ్నా పత్రం ప్లేస్ లో మరొక ప్రశ్నా పత్రం ఇవ్వడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు(శుక్రవారం)ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇది రెండు పేపర్లు కింది విభజించారు. పార్ట్ 1(పేపర్ 1), పార్ట్ 2( పేపర్2) గా విడదీసి ఒకే రోజు జరపాలని షెడ్యూల్ చేశారు. 

Education News: జేఈఈ మెయిన్స్‌ (సెషన్ 2) 2025 నిబంధనలు

అయితే పేపర్ 1 ప్లేస్ లో , పేపర్ 2 ఇవ్వడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు పేపర్‌ 2 ఇచ్చిన విషయాన్ని అధికారులు గమనించలేనట్లు సమాచారం. . ఆ తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకుని నాలుక్కరుచుకున్న అధికారులు పేపర్ ను మార్చారు.  ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు అదనపు సమయం కేటాయించారు. అయితే  బయట వేచి చూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రలకు ఈ విషయం తెలియక పోవడంతో ఆందోళనకు గురయ్యారు,.  ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి తీసుకున్నారు. ఈ ఘటనపై డీఈవో, జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 22 Mar 2025 12:43PM

Photo Stories