APPSC Examinations: ఆన్‌లైన్ విధానంలో ఏపీపీఎస్సీ పరీక్షలు
సాక్షి ఎడ్యుకేషన్: వివిధ ఉద్యోగాల భార్తీ కోసం ఏపీపీఎస్‌సీ ఈనెల 25 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తోందని పరీక్షల కో-ఆర్డినేటర్ డీఆర్వో కె.మధుసూదనరావు తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అయాన్ డిజిటల్ బృందావన్, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
TSPSC : గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై అప్పీల్‌కు వెళ్లినా..
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, గ్రూపు–4, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా పరీక్షలు నిర్వహించే కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించకూడదని పరీక్షల నిర్వహణ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.