Skip to main content

TSPSC : గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దుపై అప్పీల్‌కు వెళ్లినా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌ హైకోర్టు రద్దు చేస్తూ సెప్టెంబ‌ర్ 23వ తేదీన‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Telangana Public Service Commission,tspsc group 1 cancel case news in telugu,High Court Decision,TSPSC Exam Controversy
tspsc group 1 cancel news

అయితే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ సెప్టెంబ‌ర్ 25వ తేదీన (సోమ‌వారం) అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణకు లంచ్‌ మోషన్‌ అనుమతి కోరింది.

☛➤ టీఎస్‌పీఎస్సీ Group 1 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్‌ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ అప్పీలు చేసింది.

☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper with Key (Click Here)

2022 ఏప్రిల్‌ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

ఇక్క‌డ కూడా రద్దయితే వచ్చే ఏడాదే..?

tspsc group 1 exam cancel news telugu

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో TSPSC అప్పీలు చేసిన విష‌యం తెల్సిందే. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్‌ బెంచ్‌ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్‌ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది.

☛ TSPSC Group 1 Prelims 2023 Cancelled : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌..: గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ర‌ద్దు.. కార‌ణం ఇదే..

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించడం కష్టమనే..
వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్‌–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

☛➤ Competitive Exams: పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతున్నారా... అయితే ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి

చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్‌ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్‌ పరీక్షలు రాశారు.కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు.

Published date : 25 Sep 2023 12:46PM

Photo Stories