Competitive Exams: పోటీపరీక్షలకు ప్రిపేరవుతున్నారా... అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి
సివిల్స్, గ్రూప్ 1, 2 పరీక్షల్లో ప్రతిభ చూపాలంటే అభ్యర్థులు తగిన సాధన చేయాలి. ఆశలను నెరరేర్చుకునే క్రమంలో ఆచరణ ఉండాలి. పరీక్షకు ఏ సిలబస్ ఎంత మేరకు అవసరమో తెలుసుకుని ఉండాలి. మెటీరియల్, ఆర్థిక మద్దతు, ఆరోగ్యం, టైం.. వీటిపై స్పష్టమైన అవగాహన ఉండాలి.
లోపాలను గుర్తించాలి
ఇప్పటికే రెండు, మూడు ప్రయత్నాలు చేసి విఫలమైన వారు తమ తప్పులను, లోపాలను గుర్తించాలి.
- మీ సామర్థ్యానికి తగిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోకపోవడం
- సరైన గైడెన్స్ లేకపోవడం
- చదివిన మెటీరియల్‌లో లోపాలు ఉండడం
- విపరీతమైన పోటీ ఉంటుందని.. సరిగ్గా ప్రిపేరవ్వకపోవడం
- అకడమిక్ పరీక్షల్లో ఎలా ప్రిపేర్ అయ్యారో.. అదే విధానాన్ని ఫాలో అవ్వడం
- సాటి అభ్యర్థుల ప్రభావంతో వ`థా మార్గాల్లో ప్రిపేరవ్వడం లాంటికి అస్సలు చేయొద్దు.
చదవండి: గ్రూప్ 2 నోటిఫికేషన్.. సిలబస్, ప్రిపరేషన్ టిప్స్‌కోసం క్లిక్ చేయండి
ఈ నిర్లక్ష్యం అసలే వద్దు...
- సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో వ్యాసాలకే ప్రాధాన్యం ఉంటుంది.
- నిర్ణీత సమయంలో ఎస్సే రాయాలంటే ఆమేరకు సాధన అవసరం
- కానీ, చాలామంది అభ్యర్థలు చదవడానికి ఇచ్చినంత సమయం రాయడానికి ఇవ్వరు. దీంతో పరీక్షలో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
- చెప్పాలనుకునే అంశాన్ని సూటిగా చెప్పగలిగేలా రాయాలి. చాలామంది సబ్జెక్టును సులభంగా నోటితో చెప్పగలరు.. కానీ, రాయడానికి చాలా ఇబ్బంది పడతారు. ప్రాక్టీస్ ఉంటేనే ఈ లోపాన్ని అధిగమిస్తారు.
- పాఠ్యగ్రంథాల్లో ఉండే సమాచారాన్ని యథాతథంగా ఉపయోగించడం
- కొన్ని సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చి, ఎక్కువ సమయాన్ని కేటాయించి మిగతావాటిని నిర్లక్ష్యం చేయొద్దు.
- పాఠాలు, ప్రశ్నలను సరైన రీతిలో ఎంపిక చేసుకోకపోవడం. సరైన కోచింగ్ లేకపోవడం వల్ల మూసధోరణిలో సమాధానాలను ఇవ్వడం
గ్రూప్ -2లో ఎక్కువగా చేసే లోపాలివే...
- బిట్స్ రూపంలో చదవడం
- అవగాహన, విశ్లేషణలకు తక్కువ సమయం కేటాయించడం
- ఒకటి, రెండు పుస్తకాలను ప్రామాణికంగా భావించి గుడ్డిగా అనుసరించడం
- గణాంకాలకు అధిక ప్రాధాన్యమివ్వడం
- ఎకానమీ సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం
- జనరల్ స్టడీస్‌ను పైపైన చదవడం
- సోషల్ మీడియా ప్రభావంతో ఒకేగాటిన చదవడంతోపాటు సమయాన్ని వ`థా చేసుకోవడం
- మార్కెట్లో అసంఖ్యాకంగా పుస్తకాలు లబ్యమవుతుండడంతో ఏది ప్రామాణికమో నిర్ణయించుకోలేకపోవడం.
చదవండి: పోటీపరీక్షల్లో ఈ మెలకువలు పాటిస్తే విజయం మీదే..
అసహనాన్ని దరిచేరనీయొద్దు
గ్రూప్స్ లాంటి పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సహనం చాలా ఇంపార్టెంట్. రకరకాల సబ్జెక్టులు చదవాల్సి రావడంతో అసహనం పెరుగుతుంటుంది. ఇష్టమున్నా లేకపోయినా అన్ని రకాల సబ్జెక్టులు చదవాల్సిందే. ఇది ఒకరకంగా అభ్యర్థులకు సవాలే. అలా అని సబ్జెక్టులు చదివే క్రమంలో అర్థంకాని విషయాలు తీవ్ర అసహనానికి కారణం కావొచ్చు. గంటల తరబడి చదవాల్సి రావడం, పైగా మొదటి ప్రయత్నంలో చాలా సందేహాలుండడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురై నిరాశ ఏర్పడుతుంది. దీంతో దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు మొదట్లోనే పోటీ నుంచి వైదొలుగుతారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అవసరం. ఎప్పటికప్పుడు పరిస్థితులను వాస్తవ విశ్లేషణ చేసుకుంటూ తగిన మద్దతు ఇవ్వగలిగిన పోటీదార్లను పక్కన ఉంచుకోవడం అనుకూల ఫలితానికి తోడ్పడుతుంది.