Skip to main content

TSPSC Group 2 Exam Dates 2023 : గ్రూప్ 2 పరీక్ష తేదీలు ఇవే.. ఈ సారి ప‌రీక్ష‌ల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) గ్రూప్‌-2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను ఖరారు చేసింది. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌ను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్టు టీఎస్‌పీఎస్సీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి TSPSC గతేడాది డిసెంబర్‌ 29న నోటిఫికేషన్‌ జారీ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. 

☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

783 గ్రూప్‌–2 పోస్టుల‌కు..
ఈ గ్రూప్ -2 నోటిఫికేషన్‌లో మహిళలకు అగ్రస్థానం దక్కిందనే చెప్పొచ్చు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులు భర్తీ చేయనుండగా... వీటిలో 350 పోస్టులు మహిళలకే రిజర్వు అయ్యాయి. జనరల్‌ కేటగిరీలో 55.31 శాతం చొప్పున 433 పోస్టులున్నాయి. రెండు విభాగాల్లోని పోస్టుల్లో చూస్తే ఒక్కటీ కూడా జనరల్‌ కేటగిరీలో లేదు. కార్మికశాఖ పరిధిలోని సహాయ కార్మికశాఖ అధికారి పోస్టులు తొమ్మిది ఉంటే.. ఇవన్నీ కూడా మహిళలకే కేటాయించారు. ఎన్నికల కమిషన్‌లో రెండు సహాయ సెక్షన్‌ అధికారి పోస్టులుంటే అవి రోస్టర్‌ ప్రకారం మహిళల కోటాలోకి వచ్చాయి. సహాయ వాణిజ్య పన్నుల అధికారి పోస్టులు 59 ఉంటే మహిళలకు దాదాపు సగం వారికే రిజర్వయ్యాయి. రెవెన్యూశాఖలో నాయబ్‌ తహసీల్దారు పోస్టులు 98 ఉంటే ఇందులో 53 మహిళలవే. ఇదే తరహాలో కొన్ని విభాగాల్లో సగానికిపైగా పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. 

➤ TSPSC గ్రూప్‌–1, 2,3 & 4 కి హిస్టరీ సబ్జెక్ట్‌ను ఎలా చదవాలంటే..

మొత్తంగా ఈ నోటిఫికేష‌న్‌లో మహిళలకు 44 శాతానికి పైగా పోస్టులు దక్కినట్లు అయింది. తద్వారా 350 పోస్టులు వారికే దక్కనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండో సారి గ్రూప్ 2 నోటిఫికేషన్ తెలంగాణలో విడులైన విష‌యం తెల్సిందే.

TSPSC గ్రూప్‌–2 కేటగిరీలో.. శాఖలవారీగా ఉద్యోగ ఖాళీలు ఇవే..

పోస్టు

ఖాళీలు

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3

11

అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌

59

నాయబ్‌ తహసీల్దార్‌

98

సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2

14

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌)

63

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

09

మండల పంచాయత్‌ ఆఫీసర్‌

126

ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

97

అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (చేనేత)

38

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జీఏడీ)

165

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (శాసనసభ సచివాలయం)

15

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌)

25

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (లా)

07

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (రాష్ట్ర ఎన్నికల కమిషన్‌)

02

డిస్ట్రిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 జువెనైల్‌ సర్వీస్‌

11

అసిస్టెంట్‌ బీసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌

17

అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

09

అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

17

➤ TSPSC Group 2 Success Tips : గ్రూప్‌-2లో ఫోక‌స్ చేయాల్సిన‌ అంశాలు ఇవే..| TSPSC Group 2 Syllabus

TSPSC గ్రూప్-2 రాతపరీక్ష విధానం ఇలా.. :

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150  2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ     అండ్‌ సొసైటీ                        
  1. భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర
  2. భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)
  3. సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150
4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం                        
  1. తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)
  2. మద్దతు కూడగట్టే దశ (1971–1990)
  3. తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)
150 2 1/2 150

TSPSC గ్రూప్ 2 పరీక్ష తేదీల వివ‌రాలు ఇవే..

Published date : 28 Feb 2023 07:44PM

Photo Stories