Skip to main content

E-Sewa Kendras: తెలంగాణలో 31 ఈ-సేవా కేంద్రాలు ప్రారంభం

తెలంగాణలోని కిందిస్థాయి కోర్టుల్లో 31 ఈ-సేవా కేంద్రాలు న‌వంబ‌ర్ 24వ తేదీ ప్రారంభమయ్యాయి.
Justice PS Narasimha Launches E-Sewa Kendras in Telangana

వీటితోపాటు జ్యుడిషియల్‌ ఆఫీసర్లు వినియోగించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సేవల‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధేతో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సికింద్రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో జరిగింది.

జస్టిస్ నరసింహ మాట్లాడుతూ.. "ప్రపంచం సాంకేతిక అక్షరాస్యులు, నిరక్షరాస్యులుగా విడిపోయింది. సాంకేతికతపై పట్టు పెంచుకోకపోతే మనం సాంకేతిక నిరక్షరాస్యులుగా మారిపోతాం" అని చెప్పారు. ఆయన చెప్పినట్లుగా.. ఈ-సేవా కేంద్రాలు జ్యుడిషియరీలో అత్యంత కీలకమైనవి, అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు సాయపడతాయంటున్నారు. 

న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అద్భుతంగా మారిందని, ప్రత్యేకంగా ప్రజలకు సత్వర న్యాయం అందించే ఉద్దేశ్యంతో ఈ-సేవా కేంద్రాలు అభివృద్ధి చెందాయ‌ని నరసింహ అన్నారు.

Kaloji Kalakshetram: కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎక్క‌డంటే..

ఈ-సేవా కేంద్రాలు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవే..

  • కేసు స్థితి ప్రశ్నలు
  • కోర్టుల స్థానం తెలుసుకోవడం
  • ఈ-పిటిషన్ దాఖలు
  • ఈ-కోర్ట్ యాప్ మార్గదర్శనం
  • ఈ-ములాకత్ అపాయింట్‌మెంట్ బుకింగ్
  • న్యాయ సాయం సమాచారం
  • ట్రాఫిక్ ఛాలన్ ప్రశ్నలు
  • వర్చువల్ ఇంటరాక్షన్లు
  • డాక్యుమెంట్ రిట్రీవల్
  • ఆర్టీఐ(RTI) సహాయం

Micro Irrigation: సూక్ష్మ సేద్యంలో నాలుగో స్థానంలో ఉన్న ఏపీ

Published date : 25 Nov 2024 05:32PM

Photo Stories