Kaloji Kalakshetram: కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం
నవంబర్ 19వ తేదీ రేవంత్‌రెడ్డి కాళోజీ కళాక్షేత్రానికి చేరుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి రూ.4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్‌గా చేశారు. గ్రేటర్ మాస్టర్ ప్లాన్–2041 మ్యాపును విడుదల చేశారు. అనంతరం కళాక్షేత్రం భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.
కాళోజీ వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫొటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.
Telangana Caste Census: తెలంగాణలో కుల గణన.. ఎప్పటినుంచంటే..
ఈ సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్యమంత్రికి కాళోజీ జీవితం, అక్కడి వస్తువుల గురించి వివరించారు.
అనంతరం ఆడిటోరియంలో కాళోజీ జీవిత విశేషాలతో ప్రముఖ సినీ దర్శకుడు డాక్టర్ ప్రభాకర్ జైనీ నిర్మించిన బయోపిక్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, ట్రస్ట్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
Computer Viruses: సెకనుకో సైబర్ నేరం.. ప్రతీరోజు పుట్టుకొస్తున్న 90 లక్షల కంప్యూటర్ వైరస్‌లు!