TET/DSC Psychology Bitbank: మానవ శరీరంలో అతి చిన్న ఎముకను కలిగి ఉండే అవయవం ఏది?
1. హారిక బ్రెడ్‌ను ఆహారంగా తీసుకోవాలను కుంది. ప్యాకెట్ తెరిచి చూస్తే అది చెడిపోయినట్లు వాసన వచ్చింది. భూతద్దంతో పరిశీలిస్తే తంతువుల లాంటి పోగులు కనిపించాయి. ఆమె గుర్తించిన సూక్ష్మజీవులు ఏ రకానికి చెందుతాయి?
1) శైవలాలు
2) శిలీంద్రాలు
3) బ్యాక్టీరియా
4) వైరస్
- View Answer
- Answer: 2
2. ఎల్లోస్పాట్లో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు?
1) దండాలు
2) రోమాలు
3) కోనులు
4) ఉపకళా కణాలు
- View Answer
- Answer: 3
3. క్షయకరణ విభజనకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది
2) క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించడానికి ఉపకరిస్తుంది
3) జీవుల్లో క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది
4) ఇది శారీరక కణాల్లోనే జరుగుతుంది
- View Answer
- Answer: 4
4. సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ ఇవ్వండి అని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు నలుగురు విద్యార్థులు కిందివిధంగా సమాధానం చెప్పారు. వీటిలో సరైనవి ఏవి?
శేఖర్ – దృఢ కణజాలం
శ్వేత – మృదు కణజాలం
శ్రియ – దారు కణజాలం
శంకర్ – పోషక కణజాలం
1) శేఖర్, శంకర్
2) శ్వేత, శ్రియ
3) శ్రియ, శంకర్
4) శ్వేత, శేఖర్
- View Answer
- Answer: 3
5. క్లోమరసంలో కీమోట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఏ పదార్థాన్ని వేటిగా మారుస్తుంది?
1) కొవ్వులు – కొవ్వు ఆమ్లాలు
2) ప్రోటీన్లు– పెప్టైడులు
3) పిండి పదార్థాలు – మాల్టోజ్
4) పిండి పదార్థాలు – పెప్టోనులు
- View Answer
- Answer: 2
6. మొక్కల్లో లెగుమినేసి – రైజోబియం మాదిరిగా జంతువుల్లో...?
1) పీతలు – సముద్ర జంతువులు
2) పీతలు – సీ ఎనిమోన్లు
3) ఆల్చిప్పలు – జలగలు
4) సముద్ర నక్షత్రం – షార్క్ చేప
- View Answer
- Answer: 2
7. రాడ్యులా కలిగి ఉన్న జీవికి ఉదాహరణ?
1) దోమ
2) వానపాము
3) నత్త
4) కప్ప
- View Answer
- Answer: 3
8. మానవ శరీరంలో అతి చిన్న ఎముకను కలిగి ఉండే అవయవం ఏది?
1) కన్ను
2) చెవి
3) ముక్కు
4) కపాలం
- View Answer
- Answer: 2
9. వినాళ గ్రంథులకు సంబంధించి కిందివాటిలో సరికాని ప్రవచనం?
1) జీర్ణ రసాలను స్రవించవు
2) అంతస్రావ గ్రంథులు అని కూడా అంటారు
3) వీటి స్రావాలు నాళాల ద్వారా అవసరమైన చోటుకు ప్రవహిస్తాయి
4) వీటి స్రావాలను హార్మోన్లు అంటారు
- View Answer
- Answer: 3
10. కిందివాటిలో వేటిలో పుపుస శ్వాసక్రియ జరగదు?
ఎ. కప్ప
బి. పావురం
సి. చేపలు
డి. టాడ్‌పోల్ లార్వా
1) ఎ,బి
2) ఎ, డి
3) బి, సి
4) సి, డి
- View Answer
- Answer: 4
11. ఎర్రరక్తకణాల శ్మశాన వాటిక అని ఏ అవయవాన్ని పేర్కొంటారు?
1) ప్లీహం
2) కాలేయం
3) ఊపిరితిత్తులు
4) ఎముక మజ్జ
- View Answer
- Answer: 1
12. విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే రసాయన పదార్థం?
1) ఆక్సిన్లు
2) ఆబ్సిసిక్ ఆమ్లం
3) ఇథిలిన్ వాయువు
4) జిబ్బరెల్లిన్లు
- View Answer
- Answer: 4
13. పన్నెండు జతల క΄ాల నాడుల్లో హృదయ స్పందన నియంత్రించే వేగస్ నాడీ ఎన్నోది?
1) 9
2) 12
3) 10
4) 8
- View Answer
- Answer: 3
14. రవి కోపం, బాధ, ఆనందం లాంటి భావావేశాలను నియంత్రించుకోలేకనోతున్నాడు. అతడి మెదడులోని ఏ భాగంలో లోపం ఉండవచ్చు?
1) అనుమస్తిష్కం
2) ద్వారగోర్థం
3) మజ్జాముఖం
4) ఘ్రాణలంబికలు
- View Answer
- Answer: 2
15. సినర్జిడ్లు అనేవి మొక్కల్లోని ఏ భాగానికి సంబంధించినవి?
1) పరాగకోశం
2) పిండకోశం
3) వేరు పోషక కణాలు
4) శిఖరాగ్ర మొగ్గలు
- View Answer
- Answer: 2
16. సయాన్, స్టాక్ అనేవి వేటిలో కనిపిస్తాయి?
1) కోరకీభవనం
2) కణజాలవర్థనం
3) అంటుకట్టడం
4) ఫలదీకరణం
- View Answer
- Answer: 3
17. కిందివాటిలో ఏ రెండు జీవుల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది?
ఎ. బొద్దింక
బి. వానపాము
సి. కప్ప
డి. పాము
1) ఎ, బి
2) బి, సి
3) సి, డి
4) ఎ, డి
- View Answer
- Answer: 2
18. రాజేష్ వైద్యుడిని సంప్రదించినప్పుడు అతడు ప్రోటీన్లతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కు వగా తీసుకోకపోవడం వల్ల వ్యాధిగ్రస్థుడ య్యాడని తెలిపాడు. రాజేష్‌కు ఏ వ్యాధి వచ్చి ఉండవచ్చు?
1) క్వాషియోర్కర్
2) రికెట్స్
3) అనీమియా
4) జీరాఫ్తాల్మియా
- View Answer
- Answer: 1
19. జ్యోతి అనే గృహిణి ఆహార పదార్థాలను అతిగా ఉడకబెడుతుంది. వారి కుటుంబ సభ్యుల్లో ఏ విటమిన్ లోపం ఉండవచ్చు?
1) రెటినాల్
2) కాల్సిఫెరాల్
3) ఫోలిక్ ఆమ్లం
4) నియాసిన్
- View Answer
- Answer: 3
20. మలేరియా పరాన్నజీవి జీవితచక్రంలో షైజాంట్ దశ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది?
1) కాలేయ కణాలు
2) లాలాజల గ్రంథులు
3) ఎర్రరక్తకణాలు
4) జీర్ణాశయ గోడలు
- View Answer
- Answer: 3
21. ఎముకల సామాన్య విరుపునకు మరో పేరు?
1) జటిల ఎముకల విరుపు
2) మూసివేసిన ఎముకల విరుపు
3) లేత ఎముక విరుపు
4) బహిర్గత ఎముక విరుపు
- View Answer
- Answer: 2
22. కండరాలు ఉత్తేజం చెంది సంకోచస్థితిలోనే ఉండి΄ోవడాన్ని టిటాని అంటారు. ఈ స్థితికి కారణం?
1) సమతుల ఆహార లోపం
2) వాసోప్రెస్సిన్ తగినంత ఉత్పత్తి కాక పోవడం
3) ఆహార పదార్థాల్లో తగినంత అయోడిన్ లేకపోవడం
4)పారాథార్మోన్ అధికంగా ఉత్పత్తవడం
- View Answer
- Answer: 4
23. మెదడులోని ఏ భాగం అతి ముఖ్యమైన శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్త పీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలాజలం స్రవించడం లాంటి క్రియలను నియంత్రిస్తుంది?
1) ద్వారగోర్థం
2) మజ్జాముఖం
3) పిట్యూటరీ గ్రంథి
4) మస్థిష్క గోళార్ధాలు
- View Answer
- Answer: 2
24. ఒక మొక్క కణం పూర్తి మొక్కను ఇవ్వగలిగే శక్తిని ఏమంటారు?
1) టోటిపొటెన్సీ
2) కాలస్
3) ఎక్స్‌ప్లాంట్
4) సయాన్
- View Answer
- Answer: 1
25. కిందివాటిలో ఏ రెండు ఆవశ్యక అమైనో ఆమ్లాలు కావు?
ఎ. ఐసోటాసిన్
బి. గ్లిసరాల్
సి. లైజీన్
డి. లిపిడ్లు
1) ఎ, బి
2) బి, డి
3) ఎ, సి
4) బి, సి
- View Answer
- Answer: 2
26. కిందివాటిలో నీటిలో, కొవ్వులో కరిగే విటమిన్లకు సంబంధించి సరైన క్రమం?
1) ఆఈఉ అఇఓ
2) అఉఓఇ ఆఈ
3) ఆఇ అఈఉఓ
4) ఇఈ అఆఉఓ
- View Answer
- Answer: 3
27. కిందివారిలో ఏ ఇద్దరు శాస్త్రవేత్తలు హెచ్ఐవీని కనుగొన్నారు?
ఎ. ల్యూక్ మ్యాంట్ గ్నాయర్
బి. ఇస్మార్క్
సి. రాబర్ట్ గాలో
డి. కార్ల్ లాండ్ స్టీనర్
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, డి
4) బి, సి
- View Answer
- Answer: 2
28. సముద్ర అడుగు భాగంలో ఉండే జీవులను ఏమంటారు?
1) నెక్టాన్
2) ప్లవకాలు
3) బెంథాస్
4) నిమ్నటిక్
- View Answer
- Answer: 3
29. సముద్ర మొక్కలు దేన్ని నిక్షిప్తం చేసుకుంటాయి?
1) క్లోరిన్
2) బ్రోమిన్
3) అయోడిన్
4) సోడియం
- View Answer
- Answer: 3
30. పప్పుధాన్యాల్లో ఎక్కువగా ఉండే పోషకాలు?
1) మాంసకృత్తులు
2) పిండి పదార్థాలు
3) కొవ్వులు
4) విటమిన్లు
- View Answer
- Answer: 1
31. జుట్టు రాలకుండా ఉండటానికి ఉపయోగించే కొంథారిడియన్ తైలాన్ని స్రవించేది?
1) సిల్వర్ ఫిష్
2) లక్కమాత్
3) పట్టుమాత్
4) బ్లిస్టర్ బీటిల్
- View Answer
- Answer: 4
32. కిందివాటిలో ఎలక్ట్రాన్ గ్రహీత కానిది?
1) పైరిడాక్సిన్
2) అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్
3) సైటోక్రోం
4) ప్లాస్టో క్వినోన్
- View Answer
- Answer: 2
33. మైటోకాండ్రియా మాత్రికలో జరిగే శ్వాస క్రియ చర్యల వలయాలను విశదీకరించిన వారు?
1) మెల్విన్ కాల్విన్
2) ఆండ్రూ బెన్సన్
3) సర్హాన్స్ క్రెబ్స్
4) లిన్నియస్
- View Answer
- Answer: 1
34. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
1) ఉష్ణశక్తి వినియోగితమవుతుంది
2) ఉష్ణశక్తి విడుదలవుతుంది
3) వికిరణ శక్తి వినియోగమవుతుంది
4) రసాయన శక్తి విడుదలవుతుంది
- View Answer
- Answer: 3
35. నికర ప్రాథమిక ఉత్పాదకతను ప్రదర్శించేవి?
1) మొక్కలు
2) సూక్ష్మజీవులు
3) జంతువులు
4) నిర్జీవ కారకాలు
- View Answer
- Answer: 1
36. వాణిజ్యపరంగా విలువైన నారను ఇచ్చే మొక్క శాస్త్రీయనామం?
1) టెక్టోనా గ్రాండ్
2) క్రొటలేరియా జన్షియా
3) షోరియారాబస్టా
4) ఇల్యూసిస్ కొరకాన
- View Answer
- Answer: 2
37. కిందివాటిలో వరి వంగడం కానిది?
1) బాసుమతి
2) పూసామోతి
3) హంస
4) రవి
- View Answer
- Answer: 2
38. శక్తివనరు మొక్కకు సంబంధించిన కింది ఏ మొక్కలో ప్రత్యేక వేర్లు కనిపిస్తాయి?
1) యూకలిప్టస్
2) కాజురైనా
3) అవిసీనియా
4) లూసినా
- View Answer
- Answer: 3
39. పెట్రో పంటగా దేన్ని పిలుస్తారు?
1) డాల్బర్జియా లాటిపోలియా
2) డిజిటాలిస్
3) రిసినస్ కామ్యనిస్
4) టోడ్రియో కైకస్ బ్రానై
- View Answer
- Answer: 4
40. ఏకదళ బీజ వర్గానికి చెందిన కార్బోహైడ్రేట్లను కలిగిన మొక్కల్లో పుష్పవిన్యాస రకం?
1) స్పాడిక్స్
2) సమశిఖి
3) కంకి
4) గుచ్ఛం
- View Answer
- Answer: 3
Tags
- TET DSC Psychology Telugu Bitbank
- TET Exam bitbank
- TET DSC Educational Psychology Material Bit Bank
- Psychology Imp Bits Answers
- TET DSC 2024 Bitbank
- Latest Telugu Bitbank
- competitive exams bits
- Latest Exams bits
- Competitive Exams Bit Banks
- DSC Competitive Exam Bit Bank
- TET Competitive Exam Bit Bank
- Bitbank in Telugu
- Trending Competitive Exam Bit Bank
- TET Latest news
- DSC Latest news in telugu
- science and technology current affairs
- Bitbank
- sakshieducation daily current affairs