Skip to main content

TSPSC Group 2, 3 Posts Increase 2024  : బ్రేకింగ్ న్యూస్ .. గ్రూప్‌-2, గ్రూప్‌-3  పోస్టుల పెంపు.. ! మొత్తం ఎన్ని పోస్టులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ :  తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వ‌హించే గ్రూప్‌-2,  గ్రూప్‌-3 పోస్టుల సంఖ్య భారీగా పెర‌గ‌నున్నాయి.
Telangana Public Service Commission to Increase Group 2 and Group 3 Posts  TSPSC Group 2 and Group 3 Posts Increased 2024    Finance Department Issues Directives for TSPSC Recruitment

గ్రూప్‌2 పోస్టులు ప్ర‌స్తుతం 783 ఉండ‌గా.., గ్రూప్‌-3 పోస్టులు ప్ర‌స్తుతం 1388 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ సంఖ్య‌ను పెంచే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా త‌ర్వ‌గా వివిధ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివ‌రాల‌ను తెల‌పాల‌ని. . ఆర్థిక శాఖ కీల‌క ఆదేశాల‌ను విడుద‌ల చేసింది.

---> TSPSC Group 2 and group 3 exam dates, syllabus, exam type 2024 

పెంపు ఇలా..?
గ్రూప్‌-2లో దాదాపు 783 పోస్టుల‌ నుంచి 800 పోస్టుల వ‌ర‌కు, గ్రూప్‌-3లో 1388 పోస్టుల నుంచి దాదాపు 1500 పోస్టుల‌కు పెరిగే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వ‌హింస్తామ‌ని తెలిపింది. అలాగే గ్రూప్‌-3 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

Published date : 09 Mar 2024 11:34AM

Photo Stories