Skip to main content

Good News For Employees : ఉద్యోగుల‌కు ఈ నెల‌లో పండ‌గే పండ‌గ‌.. ఒక వైపు బోన‌స్‌.. మ‌రో వైపు భారీగా...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ నెల‌లో పండ‌గే పండ‌గ‌. ఒక వైపు బోన‌స్‌.. మ‌రో వైపు జీతం పెంపు.. రెండు ఒకేసారి రానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై కూడా స్పష్టత రానుంది.
Salary Hike For Government Employees

ఈ ఏడాది దీపావళికి ముందే పెరిగిన జీతం అందుకోనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీపావళికి ముందే డీఏ పెంపు ప్రకటన వెలువడే అవ‌కాశం ఉంది. 

Follow our YouTube Channel (Click Here)

కోటికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం డీఏ రూపంలో అందుతోంది. జనవరిలో పెరగాల్సిన తొలి విడత 4 శాతంతో 50 శాతమైంది. ఇప్పుడు రెండో విడతలో భాగంగా 3-4 శాతం పెరుగుతుందనే అంచనా ఉంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ఇదే చెబుతోంది. ఎందుకంటే డీఏ పెంపు అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగానే నిర్ణయిస్తుంటారు. కోటికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ డీఏ పెంపు ద్వారా లబ్ది పొందనున్నారు.

☛➤ TG DSC 2024 Toppers Success Stories : కానిస్టేబుల్​గా ఉద్యోగం చేస్తూనే.. టీచ‌ర్ ఉద్యోగం సాధించాం ఇలా.. కుటుంబ పోషణ కోసం..

పెంపు ఇలా..
ఉద్యోగుల కనీస వేతనం 18 వేల రూపాయలుంటే ప్రస్తుతం డీఏ రూపంలో 9 వేలు అందుతున్నాయి. ఇప్పుడు 3 శాతం డీఏ పెరిగితే నెలకు 540 రూపాయలు పెరగనుంది. అదే 4 శాతం పెరిగితే మాత్రం మొత్తం డీఏ 9,720 రూపాయలు ఏడాదికి పెరగనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ 12 నెలల సరాసరి ఆధారంగా డీఏ పెంపు అనేది నిర్ణయమౌతుంది. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల ప్రకారం ఇది ఉంటుంది. ద్రవ్యోల్బణం తట్టుకునేందుకు డీఏ పెంపు అనేది అనివార్యం. ఎంత పెరుగుతుందనేది ఇంకా అధికారికంగా తెలియకపోయినా దీపావళి కంటే ముందే డీఏ పెంపు ప్రకటన వెలువడనుంది.

➤☛ TS Govt Jobs Recruitment 2024 : 60000 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇలా.. 

అక్టోబర్ నెలలో జీతం భారీగానే... 
జనవరి డీఏ పెంపు ప్రకటన ఈ ఏడాది మార్చ్ నెలలో వెలువడగా మూడు నెలల ఎరియర్లతో సహా చెల్లించారు. అదే విధంగా జూలై ప్రకటన అక్టోబర్ నెలలో వెలువడనుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఎరియర్లతో సహా అక్టోబర్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. అదే విధంగా పెన్షనర్లకు డీఆర్ పెరగనుంది.

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Oct 2024 10:54AM

Photo Stories