Skip to main content

TG DSC 2024 Toppers Success Stories : కానిస్టేబుల్​గా ఉద్యోగం చేస్తూనే.. టీచ‌ర్ ఉద్యోగం సాధించాం ఇలా.. కుటుంబ పోషణ కోసం..

సెప్టెంబ‌ర్ 30వ తేదీన తెలంగాణ ముఖ్య‌మంత్రి విడుద‌ల చేసిన డీఎస్సీ ఫ‌లితాల్లో ఎంతో మంది పేది విద్యార్థులు.. త‌మ ప్ర‌తిభ చాటి ఉద్యోగం సాధించారు.
Telangana DSC 2024 Toppers Success Stories

తెలంగాణ‌లోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా చేస్తున్న వీర్ల మౌనిక స్కూల్ అసిస్టెంట్​తోపాటు ఎస్‌జీటీ ఫలితాల్లో సత్తా చాటి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేప‌థ్యంలో వీర్ల మౌనిక స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం...

కానిస్టేబుల్​గా ఉద్యోగం చేస్తూనే..
వీర్ల మౌనిక స్కూల్​ అసిస్టెంట్​ఎగ్జామ్​లో 75.23 మార్కులు తెచ్చుకున్నారు. అలాగే ఎస్జీటీలో 77.9 మార్కులు సాధించింది. వీరు బెల్లంపల్లి మండలం బూదాకుర్డ్ గ్రామానికి చెందిన వారు. మౌనిక తండ్రి వీర్ల మల్లయ్య. ఈయ‌న ఒక సాధార‌ణ‌ రైతు. త‌ల్లి పేరు వజ్ర. ఈమె ఎంతో పట్టుదలతో చదివి 2020లో కానిస్టేబుల్​గా ఉద్యోగం సాధించింది.

➤☛ TS Govt Jobs Recruitment 2024 : 60000 ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఇలా..

ప‌ట్టు ప‌ట్టితే ప్ర‌భుత్వ ఉద్యోగ‌మే...
మౌనిక.. స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రైమరీ వరకు, గ్రామంలోని బాల భారతి హైస్కూల్‌లో టెన్త్ చదివారు. ఆ తర్వాత బెల్లంపల్లి పట్టణంలోని భారతి జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. అలాగే హైదరాబాద్‌లో పై చదువులు చదివింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన హాస్టల్​వెల్ఫేర్​ ఆఫీసర్​ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే సెకండ్​ప్లేస్​లో నిలిచింది. తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని మౌనిక తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

పేదింటి బిడ్డకు ఉన్న‌త ర్యాంక్ కొట్టి..
ఆదిలాబాద్​ జిల్లాలోని నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామానికి చెందిన చొక్కపల్లి శివకృష్ణ ఎస్జీటీ విభాగంలో జిల్లా స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. శివకృష్ణ తండ్రి చొక్కపల్లి శంకర్. ఈయ‌న వడ్రంగి పనులు చేస్తుంటారు. త‌ల్లి
లలిత. 

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

ఆర్థిక సమ‌స్య‌ల‌తో.. కుటుంబ పోషణ భారంగా మారినా..
శివకృష్ణ టెన్త్ వరకు స్థానిక జడ్పీ హైస్కూల్ లో, ఇంటర్ నిర్మల్ జిల్లాలోని దీక్ష జూనియర్ కాలేజీలో, టీటీసీ ఆదిలాబాద్ లోని డైట్ కాలేజీలో చదివాడు. పేదరికంలో మగ్గుతూ, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారినా శివకృష్ణను కష్టపడి చదివించారు.

హెడ్ కానిస్టేబుల్​ ప‌నిచేస్తూనే.. జిల్లా టాప‌ర్‌గా నిలిచానిలా..
ఆదిలాబాద్ పట్టణంలోని వన్​ టౌన్​లో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న గిన్నెల సత్యమోహన్-విజయ దంపతుల కూతురు గిన్నెల ప్రవళిక డీఎస్సీ ఎస్జీటీ 2024 ఫలితాల్లో సత్తా చాటింది. టెట్​లో 150కి గానూ 139 మార్కులు సాధించి టాపర్​గా నిలిచారు ప్రవళిక. ఎస్జీటీలో 83.53 మార్కులు తెచ్చుకొని జిల్లాలో ఫస్ట్​ ప్లేస్​సాధించింది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Published date : 03 Oct 2024 11:01AM

Photo Stories