Two Sisters Success Story : ఓ తండ్రి కథ.. తమ ఇద్దరి కూతుర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా చేశాడు ఇలా.. కానీ...
తాము పడ్డ కష్టం పిల్లలు పడకూడదని బాగా చదివించాలని చూస్తారు. అలాగే కాయకష్టం చేసి వీరిని చదివిస్తుంటారు. తమ కష్టాలను గట్టెక్కించి ఆసరగా ఉంటారని బిడ్డలపై కొండంత ఆశ పెట్టుకుంటారు. డాక్టర్, లాయర్, టీచర్, ఇంజినీర్ ఇలా ఏదో ఒకటి కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావం కారణంగా లక్ష్యాన్ని చేరుకోలేకపోతారు. తాము సాధించలేకపోయినా తమ పిల్లలు సాధించాలని వెన్నంటి ప్రోత్సహిస్తుంటారు.
ఈ తండ్రి కథ ఇదే..
ఈ తండ్రి తన కూతుర్లను బాగా చదివించాడు. తండ్రి కష్టాన్ని చూసిన కుమార్తెలు కష్టపడి చదివారు. లక్ష్యాన్ని మరవకుండా ముందుకుసాగారు. అంకితభావంతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేధించారు. తండ్రి తన కలను సాధించలేకపోయినా కూతుర్లు సాధించి చూపించారు. ఇటీవల తెలంగాణలో విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఆ కూతుర్లిద్దరు టాప్ ర్యాంకులు సాధించారు. తండ్రి కష్టంకు..వీరి ప్రతిభకు ఫలితం దక్కింది.
వీరు ఒకేసారి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించారు. అక్టోబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీచర్లుగా నియామక పత్రాలు అందుకున్నారు. వీరే తెలంగాణలోని కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్ కుమార్తెలు సుధా, శ్రీకావ్యలు.
టీచర్ కావాలనే ఆయన కల కలగానే..
హుస్నాబాద్ కు చెందిన శ్రీశైలం గౌడ్‌ది రైతు కుటుంబం. బాగా చదువుకుని ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకున్నాడు. అందుకు అలుపెరుగని కృషి చేశాడు. ఈ క్రమంలో ఆయన డీఎస్సీ రాశాడు. కానీ.., విజయం సాధించలేకపోయాడు. టీచర్ కావాలనే ఆయన కల కలగానే మిగిలిపోయింది. చివరకు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
వీరు ట్యూషన్స్ చెబుతూ..
శ్రీశైలం గౌడ్‌కు ఇద్దరు కూతుర్లున్నారు. వారు సుధ, శ్రీకావ్యలు. వీరు తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగారు. ఉద్యోగ ప్రయత్నంలో విఫలమైన తండ్రి శ్రమను ప్రత్యక్షంగా చూశారు. తండ్రి కలను నిజం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో సుధ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసింది. శ్రీకావ్య డీఎడ్ పూర్తి చేసింది. వీరిద్దరు కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూనే డీఎస్సీకి సన్నద్ధమయ్యారు. టీచర్ జాబ్ కొట్టడమే లక్ష్యంగా రోజుకు 14 నుంచి 18 గంటలు ప్రిపరేషన్ కొనసాగించారు.
ఇద్దరు అక్కాచెల్లెల్లు... ఒకేసారి..
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ-2024 పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ర్యాంకులు కైవసం చేసుకుని సత్తాచాటారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ కోసం సన్నద్ధమైన సుధ... మ్యాథ్స్ లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్ లో మొదటి ర్యాంకు సాధించారు. శ్రీకావ్య ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఇద్దరు అక్కాచెల్లెల్లు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా టీచర్ ఉద్యోగ నియామక పత్రాలను అందుకున్నారు.
మా విజయంతో మా తండ్రి...
కూతుర్లు ఇద్దరు ఒకేసారి టీచర్ జాబ్స్ సాధించడంతో తండ్రి శ్రీశైలం గౌడ్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కుటుంబంలో సంతోషం వెల్లువిరిసింది. ఒకేసారి టీచర్ జాబ్స్ సాధించిన సుధా, శ్రీకావ్యలపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. స్నేహితులు, బంధువులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరి తండ్రి సాధించలేకపోయిన కలను కూతుర్లు సాధించిన తీరుపై... ఎంతో మంది నేటితరం కూతుర్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
Tags
- DSC Top Ranker Success Stories in Telugu
- TG DSC 2024 Topper Success News
- TG DSC 2024 Topper Real Life Story
- TG DSC 2024 Topper
- TG DSC 2024 Topper News in Telugu
- Two Sisters Success Story
- Two Sisters DSC RankersSuccess Story
- Two Sisters DSC Rankers Success Story in Telugu
- father success story
- two sisters get government teacher jobs in telangana
- DSC Ranker Success Story
- father story
- father story in telugu
- DSC Ranker Success Stories
- ts dsc ranker success stories
- ts dsc ranker success stories in telugu
- dsc ranker success story in telugu
- tg dsc ranker success stories in telugu
- ts dsc ranker success story in telugu
- DSC Ranker Success Stories In Telugu
- dsc ranker success stroy in telugu
- DSC