DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపిక పరీక్ష
మహారాణిపేట : ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారికి డీఎస్సీ ఉచిత శిక్షణకు ఈ నెల 10వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 10 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందని.. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సుమారు 3,200 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు.
వారం రోజుల పాటు పాఠశాలలు బంద్.. ఎందుకంటే: Click Here
మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహణపై అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరీక్ష కేంద్రాల్లో నెట్‌వర్క్, విద్యుత్ సదుపాయం నిరంతరాయంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, ఆర్టీసీ సర్వీసులను ఆయా కేంద్రాల రూట్లలో నడపాలని అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
మూడు నెలల పాటు ఉచిత శిక్షణ
సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు మాట్లాడుతూ ఎంపికై న వారికి మూడు నెలల పాటు ఉచిత శిక్షణతోపాటు మెటీరియల్, మెస్ ఫీజులు చెల్లిస్తామని వివరించారు. సమావేశంలో డీఆర్వో భవానీ శంకర్, డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
Tags
- DSC Free Coaching Selection Test
- Free Coaching
- DSC Latest News
- DSC
- Free Coaching For DSC
- Latest free coaching news
- today Latest Free Coaching news in telugu
- DSC Exam 2024
- DSC Exam Coaching
- dsc choaching news latest
- DSC candidates
- Applications
- free training program
- Selection Program for DSC
- DSCEntranceTest
- MaharanipetExam
- FreeDSCTraining
- SCSTCommunity
- VisakhapatnamDSC
- #OnlineExamCenters
- DistrictSelectionCommittee
- SCSTFreeTraining
- DSCTrainingProgram