Skip to main content

Summative Exams: ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్‌ పరీక్షలు

చిత్తూరు కలెక్టరేట్‌ : విద్యార్థుల విద్యాస్థాయిని తెలుసుకునేందుకు ఏటా నాలుగు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, రెండు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో భాగంగా రెండో సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షను బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
Summative Exams  Self assessment and summative exam dates
Summative Exams Self assessment and summative exam dates

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని యాజమాన్యాల పాఠశాలలు 2982 ఉన్నాయి. అందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 2,84,128 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఒకటి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 1.10 నుంచి 2.10 గంటల వరకు ఒక పరీక్ష, 2.20 నుంచి 3.20 గంటల వరకు మరో పరీక్ష జరుగుతుంది. ఇక తొమ్మిది, పది తరగతులు విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మళ్లీ 11.15 నుంచి 12.15 గంటల వరకు నిర్వహిస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ముద్రిత ప్రశ్నపత్రాలను ఎంఆర్‌సీ కార్యాలయం, కాంప్లెక్స్‌ కేంద్రాల నుంచి సరఫరా చేస్తారు. అందులోనూ ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లకు మాత్రమే వీటిని ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా అందజేస్తారు.

Jobs In Reserve Bank of India: ఆర్‌బీఐలో ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం.. జీతం రూ.2.25 లక్షలకు పైనే..

ప్రైవేట్‌ యాజమాన్యాల్లో సొంత ప్రశ్నపత్రం..

జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో ఆయా యాజమాన్యాలు రూపొందించే సొంత ప్రశ్నపత్రాలనే పరీక్షలకు వినియోగించనున్నారు. గతంలో జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ప్రైవేట్‌ యాజమాన్యాలకు సైతం ప్రశ్నపత్రాలను సరఫరా చేసేవారు. దీంతో ఆయా యాజమాన్యాల నిర్వహకుల్లో పరీక్షల నిర్వహణ పట్ల బాధ్యత ఉండేది. అయితే ఈసారి గత విధానాన్ని అనుసరించడం లేదు. ఈ విధానంతో ప్రైవేట్‌ స్కూళ్లలో పరీక్షల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంటుందని విద్యావేత్తలు అంటున్నారు.

ప్రశ్నపత్రాలు పంపిణీ..

ఎస్‌సీఈఆర్‌టీ ద్వారా సరఫరా అయిన ప్రశ్నపత్రాలను మండల కేంద్రాలకు పంపించాం. ప్రభుత్వ యాజమాన్యాలకు మాత్రమే ప్రశ్నాపత్రం పంపడం జరుగుతుంది. ప్రైవేట్‌ యాజమాన్యాల్లో సొంత ప్రశ్నపత్రం వినియోగిస్తారు. ఎస్‌ఏ–2 పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష జరిగే రోజు మాత్రమే పేపర్లను స్కూళ్లకు సరఫరా చేయనున్నాం. ఎక్కడా ఎటువంటి మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం లేని విధంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం.

– పరశురామనాయుడు, సెక్రటరీ, డీసీఈబీ, చిత్తూరు

 

Half day Schools 2024 : గుడ్‌న్యూస్‌.. రేప‌టి నుంచి ఒంటి పూట బడులు.. ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌.. మొత్తం ఎన్ని రోజులంటే..?

 

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి ఎస్‌ఏ–2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలను ఉపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతి పేపరుపై జిల్లా కోడ్‌ ఉంటుంది. ఏ పాఠశాల నుంచి అయినా పేపరు లీక్‌ అయితే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే వీలుంది. పబ్లిక్‌ పరీక్షల మాదిరిగానే సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలను నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయ్‌.

– వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 05 Nov 2024 12:51PM

Photo Stories