Skip to main content

AP Schools: ఈనెల 27 నుంచి సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ ఇదే

AP Schools Self Assessment Exams

సత్తెనపల్లి: విద్యార్థుల సామర్థ్యం అంచనా వేసేందుకు నిర్వహించే యూనిట్‌ పరీక్షల పేరును సెల్ఫ్‌ అసెస్మెంట్‌ (స్వీయ మూల్యాంకనం)గా మార్చుతూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌ (నిర్మాణాత్మక మూల్యాం కనం) పేరుతో మూడు రోజులు నిర్వహించే వారు. తాజాగా పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారం ఆరు రోజులు పరీక్ష నిర్వహిస్తారు. స్వీయ మూల్యాంకనం–1 పరీక్షలను ఈనెల 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేట్‌ మినహా అన్ని ప్రభుత్వ అనుబంధ పాఠశాలలకు జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ ద్వారా పరీక్ష పేపర్లను సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

AP ICET 2024 Admissions : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నేటి నుంచే అడ్మీషన్లు

షెడ్యూల్‌ ఇదీ..
ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండు వరకు ప్రాథమిక తరగతులకు ఉదయం 10.45 నుంచి 11.45 వరకు పరీక్ష నిర్వహిస్తారు. 28న తెలుగు, 30న ఇంగ్లీష్‌, 31న గణితం, సెప్టెంబర్‌ 2న పరిసరాల విజ్ఞానం పరీక్షలు ఉంటాయి. ఉన్నత తరగతులకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకూ నిర్వహించనున్నారు. 27న ఓఎస్‌ఎస్‌సీ, 28న తెలుగు, 30న హిందీ, 31న ఇంగ్లీష్‌, 2న గణితం, 3న జనరల్‌ సైన్స్‌, 4న సోషల్‌ సబ్జెక్టులపై పరీక్షలు నిర్వహించనున్నారు.

SSC JE Paper I Results Declared: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్‌ పేపర్‌-1 ఫలితాలు విడుదల

ఈనెల 27 నుంచి పరీక్షలు
జిల్లాలో ఈనెల 27 నుంచి స్వీయ మూల్యాంకనం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నాం. నిర్మాణాత్మక మూల్యాంకనం పేరును స్వీయ మూల్యాంకణంగా మార్చడం జరిగింది. డీసీసీబీ ముద్రించిన ప్రశ్నపత్రాలు ఆయా పాఠశాలలకు అందేలా చర్యలు తీసుకుంటాం.

1 నుంచి 8 తరగతుల వరకూ సీబీఏ విధానంలో ఓఎంఆర్‌ షీట్స్‌ పై పరీక్షలు నిర్వహిస్తాం. 9,10 తరగతులకు గతంలో లాగానే పరీక్ష ఉంటుంది. రోజుకు ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు పూర్తి చేయనున్నాం.
–ఎం.వెంకటేశ్వర్లు,జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు
 

Published date : 21 Aug 2024 03:54PM

Photo Stories