Parents-Teachers : డిసెంబర్ 7న ఘనంగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం..
డిసెంబర్ 7న మెగా పేరెంట్స్–టీచర్స్‌డేను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీనిపై విధివిధానాలను ఇప్పటికే ఉపాధ్యాయులకు తెలియజేశాం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా చేసుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఉత్తర్వులు వచ్చాయి. ఆ నిధులతో అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.
– నల్ల తిరుపతినాయడు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా
Breaking News All Schools Holiday: స్కూల్స్, కాలేజీలు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
నిధులు పెంచాలి
పేరెంట్స్ టీచర్స్ డేను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది మంచి కార్య క్రమ మే. దీనికి సరిపడేలా నిధులు విడుదల చేయాలి. మైక్‌సైట్, షామియానా, పూలదండలు, భోజనాల ఖర్చులను పెరిగిన ధరలకు అనుగుణంగా కేటాయించాలి. లేదంటే ఉపాధ్యాయులకు చేతి చమురు వదులుతుంది. నిధులను పెంచాలి.
– మజ్జి పైడిరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి, వీరఘట్టం
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
చాలీచాలని నిధులతో ఇబ్బందులే
పేరెంట్–టీచర్స్ సమావేశా న్ని గ్రాండ్‌గా చేయాలంటే నిధులు అవసరం ఉంది. కొన్ని చోట్ల దాతలు ముందుకు వస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేస్తున్న చాలీచాలని నిధులతో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలో అర్ధం కావడం లేదు. నిధులు పెంచకపోతే ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవు
– అన్ను వెంకటరావు, ఎస్సీ, ఎస్సీ ఉపాధ్యాయ సంఘం, రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్, వీరఘట్టం
DAO Provisional Selection List: డీఏఓ ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల