DAO Provisional Selection List: డీఏఓ ప్రొవిజినల్ సెలక్షన్ జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వర్క్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో డీఏఓ (డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నవంబర్ 29న విడుదల చేసింది.
2022, ఆగస్టులో 53 డీఏఓ ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు 1,06,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. మల్టీజోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని, తదుపరి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: Special Deputy Collector Posts: సెలక్షన్ గ్రేడ్‌కు 33 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 30 Nov 2024 01:15PM
Tags
- DAO Jobs
- divisional accounts officer
- Accounts Department
- telangana public service commission
- TGPSC
- TGPSC Notification
- Jobs
- TGPSC DAO Results 2024 Declared
- TSPSC DAO Results 2024
- Telangana Jobs
- Telangana News
- TSPSC Divisional Accounts Officer Selection List
- Telangana Public Service Commission DAO Results 2024