Skip to main content

TGPSC Group-1 Toppers Success Stories : ఇలా చ‌దివితే.. గ్రూప్‌ 1 ఆఫీస‌ర్ అవ్వ‌డం ఈజీనే

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌–1 ఫలితాల్లో ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ విద్యార్థులు రికార్డు స్థాయిలో 100కు పైగా ర్యాంక్‌లు సాధించారు. గత 45 సంవత్సరాలుగా ఎంతో మంది సివిల్స్, గ్రూప్‌–1 స్థాయి అధికారులను తయరుచేసిన.. ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఈ సారి కూడా ఎప్పటి లాగే రికార్డు స్థాయి ర్యాంకులు సాధించి... నెం–1 స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో గ్రూప్‌–1 ర్యాంకర్లను సంస్థ డైరెక్టర్‌ ఆర్‌సీ రెడ్డి అభినందించారు.

డైరెక్టర్‌ ఆర్‌సీ రెడ్డి మాట్లాడుతూ... మా సంస్థ నుంచి ఇంత భారీ సంఖ్యలో ర్యాంకులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచి అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో పాటు మంచి స్టడీమెటీరియల్, గైడెన్స్, టెస్ట్‌సిరీస్, మెంటర్‌షిప్‌ ఇవ్వడం మా సంస్థ బలం అన్నారు. అలాగే ప్రతి విద్యార్థిపై మేము ప్రత్యేక ఫోకస్‌ పెట్టి... అతనిని మంచి ర్యాంకర్‌గా తయారుచేయడంలో మేము ఎప్పడు ముందు ఉంటామన్నారు. అలాగే వీళ్ల విజయంకు కారణం అయిన ఫ్యాకల్టీలను ప్రత్యేకంగా అభినందించారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ర్యాంకర్లను తయారు చేయడమే మా లక్ష్యం అన్నారు. ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సంఘమిత్ర గారు మాట్లాడుతూ... మా సంస్థ నుంచి గ్రూప్‌–1లో టాప్‌ ర్యాంక్‌లు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. షెడ్యూల్‌ ప్రకారం క్లాసులతో పాటు.. టైమ్‌ ప్రకారం టెస్టులు నిర్వహించడం.., మంచి స్టడీమెటీరియల్‌ అందించడం మా ప్రత్యేక అన్నారు. అలాగే మాకు తక్కువ సమయంతో ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి ఆర్‌సీ రెడ్డి ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ ఎంతో దోహదపడిందని గ్రూప్‌–1లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు తెలిపారు.

Photo Stories