Skip to main content

TGPSC Group 1 Mains: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం?

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాల పునఃమూల్యాంకనానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) తన వైఖరిని తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 21కి వాయిదా వేసింది.
Re evaluation of Group 1 Mains exam answer sheets   Telangana High Court orders TSPSC to respond on Group-1 Mains revaluation

పిటిషన్‌ వివరాలు:

ఖమ్మం జిల్లా నివాసి ఎస్‌. నరేశ్‌ సహా మరో 22 మంది అభ్యర్థులు, గ్రూప్‌–1 మెయిన్స్‌ పేపర్‌ మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తిరిగి మూల్యాంకనం చేయాలని, తదుపరి నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు.

పిటిషనర్ల వాదనలు:

మెయిన్స్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని, 18 సబ్జెక్టుల్లో 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

మూడు భాషల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ, తెలుగు, ఉర్దూ భాషల నిపుణులను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.

తెలుగు, ఆంగ్ల మీడియం పేపర్లు ఒకే నిపుణులతో మూల్యాంకనం చేయించారని, స్థానిక చరిత్ర, తెలంగాణ ఉద్యమం అంశాల్లో అవగాహన లేని నిపుణులను నియమించారని పేర్కొన్నారు.

చదవండి: Group 1-2-3-4 Ranker: గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలన్నింట్లోనూ ర్యాంకులు.. శభాష్ హవల్దారి శ్రీనాథ్‌!

టీఎస్‌పీఎస్సీ వాదనలు:

351 మంది నిపుణులు 12 సబ్జెక్టుల మూల్యాంకనంలో పాల్గొన్నట్లు టీఎస్‌పీఎస్సీ న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ హైకోర్టుకు తెలిపారు.

న్యాయమూర్తి ఆదేశాలు:

టీఎస్‌పీఎస్సీ వైఖరి తెలియజేయాలని నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఏప్రిల్‌ 21కి వాయిదా వేసింది.

చదవండి: TGPSC Competitive Exams Ranks 3–7–27–27: అన్ని పోటీ పరీక్షల్లో ర్యాంక్‌లు.. చంద్రకాంత్‌ అద్భుత ప్రదర్శన!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 25 Mar 2025 01:14PM

Photo Stories