Skip to main content

Junior Colleges : జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో మూడు రోజుల‌పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌!!

విద్యార్థుల‌కు చిన్న చిన్న ప‌రీక్ష‌లు అంటేనే ఎంతో కంగారు ప‌డ‌తారు. ఎలా చ‌ద‌వాలి, ఎటువంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయో ఏమో అని దిగులు ఉంటుంది.
Meditation classes at junior colleges for students relaxation  Yoga trainers from Hyderabad teaching meditation to first and second-year Intermediate students

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థుల్లో ప‌రీక్ష‌ల‌పై టెన్ష‌న్ ఆందోళ‌న ఎక్కువ ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఇంటర్ విద్యార్థుల‌కు పరీక్షలు దగ్గర పడుతున్న కొద్ది మ‌రింత టెన్ష‌న్ పెరిగిపోతుంది. ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి ఇంట‌ర్ విద్యార్థుల‌కు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మెడిటేషన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఒక వ్యక్తికి ప్ర‌శాంత‌త క‌లిగించేది ద్యానం మాత్ర‌మే.

Inter Board : ఇంట‌ర్ విద్యార్థుల నైపుణ్యాల‌కు బోర్డు ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. ఈసారి కూడా..

దీని కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో యోగా ట్రైనర్లతో విద్యార్థులకు మెడిటేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఒక్కో కళాశాలలో మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్‌ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు హైదరాబాద్‌ నుంచి యోగా శిక్షకులు వచ్చి కళాశాలల్లో మెడిటేషన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

గతంలో ఇంటర్‌ ఫలితాల వెల్లడి అనంతరం ఫెయిల్‌ అయినవారిలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్న విషయం విదితమే. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్ధేశంతో విద్యార్థులను మానసికంగా సిద్ధం చేసేందుకు ఇంటర్‌ విద్యాధికారులు సరికొత్త నిర్ణయం తీసుకోవడం విశేషం. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

TG Inter 2nd Year 2025 Time Table: ఇంటర్‌ 2nd ఇయర్‌ పరీక్షల టైం-టేబుల్‌ విడుదల..సబ్జెక్టుల వారీగా మెటీరియల్స్‌ ఇవే

విద్యార్థుల భవిష్యత్తు కోసమే..

విద్యార్థుల ప్రయోజనాలను, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఇంటర్‌ బోర్డు మెడిటేషన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ శిక్షణ తరగతులపై జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నాం.

- రవికుమార్‌, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 02 Jan 2025 11:27AM

Photo Stories